Independence Day 2023: ప్రయాణీకులకు హైద‌రాబాద్ మెట్రో అదిరిపోయే ఆఫర్‌.. ఆ మూడు రోజులు రూ. 59కే అన్‌లిమిటెడ్ జ‌ర్నీ..

Hyderabad Metro Rail Announces Super Saver Freedom Offer
x

Independence Day 2023: ప్రయాణీకులకు హైద‌రాబాద్ మెట్రో అదిరిపోయే ఆఫర్‌.. ఆ మూడు రోజులు రూ. 59కే అన్‌లిమిటెడ్ జ‌ర్నీ..

Highlights

Hyderabad Metro Rail: 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైల్ బంపరాఫర్ ప్రకటించింది.

Hyderabad Metro Rail: 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైల్ బంపరాఫర్ ప్రకటించింది. ప్రయాణికుల సౌలభ్యం కోసం సూపర్ సేవర్ ఫ్రీడమ్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా HMR ప్రయాణికులకు ఈ ప్రత్యేకమైన ఆఫర్ ఇవ్వనున్నట్లు మెట్రో యాజమాన్యం తెలిపింది. ఈ బంపర్ ఆఫర్ ఆగస్ట్ 12, 13, 15 తేదీల్లో అందుబాటులోకి వస్తోందని చెప్పింది. ఈ ఆఫర్‌లో భాగంగా కేవలం 59 రూపాయలతో సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్‌ను రీఛార్జ్ చేసుకోవాలి. 59 రూపాయల రీఛార్జ్‌తో వీకెండ్‌ను ఆస్వాదించడానికి అనువుగా ఉండడంతో పాటు అపరిమిత మెట్రో రైడ్లు చేసే అవకాశం ఉంటుంది. మెట్రో ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మెట్రో యాజమాన్యం తెలిపింది.

ఈ సంద‌ర్భంగా ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైద‌రాబాద్ లిమిటెడ్ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి మాట్లాడుతూ.. ప్ర‌యాణికుల‌ను దృష్టిలో ఉంచుకుని సూప‌ర్ సేవ‌ర్ ఫ్రీడం ఆఫ‌ర్ ప్ర‌క‌టించినందుకు సంతోషంగా ఉంద‌న్నారు. ఈ ఆఫ‌ర్‌ను ప్ర‌తి ఒక్క‌రూ స‌ద్వినియోగం చేసుకోవాల‌ని, మెట్రోను ఆద‌రించాల‌ని ఆయ‌న కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories