Fact Check వైరల్ వార్త.. ఇదీ నిజం! రోజాకి ముఖ్యమంత్రి జగన్ వార్నింగ్.. నిజమెంత?

Fact Check వైరల్ వార్త.. ఇదీ నిజం! రోజాకి ముఖ్యమంత్రి జగన్ వార్నింగ్.. నిజమెంత?
x
Highlights

ఇదిగో పులి..అదిగో తోక అనడం మన సోషల్ మీడియాలో చాలా ఎక్కువ. ఎక్కడా లేని విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు గంటకి ఒకటి.. ఇంకా చెప్పాలంటే నిమిషా నిమిషమూ షికార్లు చేస్తాయి. ఈ పుకార్ల తో చాలా మంది ఇబ్బంది పడ్డ సందర్భాలూ ఉన్నాయి. కొన్ని పుకార్లు సీరియల్ గా షికారు చేయడం మన తెలుగు స్పెషాలిటీ. అటువంటి వాటిలో రోజా జబర్దస్త్ కార్యక్రమం పై జగన్ సీరియస్ అనే వార్త ఒకటి. ఇందులో నిజా నిజాలెంత అనేది పరిశీలిస్తే..

ఇదిగో పులి..అదిగో తోక అనడం మన సోషల్ మీడియాలో చాలా ఎక్కువ. ఎక్కడా లేని విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు గంటకి ఒకటి.. ఇంకా చెప్పాలంటే నిమిషా నిమిషమూ షికార్లు చేస్తాయి. ఈ పుకార్ల తో చాలా మంది ఇబ్బంది పడ్డ సందర్భాలూ ఉన్నాయి. కొన్ని పుకార్లు సీరియల్ గా షికారు చేయడం మన తెలుగు స్పెషాలిటీ. ఎన్నిసార్లు ఆ పుకార్లు తప్పు అని తేలినా.. మళ్లీ అటువంటి సందర్భం వచ్చిందంటే అదే గాలి వార్తకు రంగు మార్చి తిరిగి వదిలేస్తారు. ఈ క్రియేటివిటీలో మనదే అగ్రస్థానం అనండంలో సందేహమేమీ అక్కరలేదు. ఇప్పడు అటువంటి ఒక ఎవర్ గ్రీన్ తాజా పుకారు గురించి.. అందులో నిజాలెంత అన్నాదాని గురించి విశేషాలు మీ కోసం!

సినిమాల్లో నటించినా.. రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించినా.. టీవీ షోలలో జనాల మధ్య తన వాణి వినిపించినా అందులో ప్రత్యేకస్థానం రోజా సెల్వమణిదే! హీరోయిన్ గా సక్సెస్ ఫుల్ గా ముందడుగు వేసిన రోజా తరువాతి కాలంలో రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేశారు. అక్కడ టీడీపీ పార్టీలో చాలా కాలం కొనసాగినా సరైన గుర్తింపు పార్టీ నుంచి లభించకపోవడం తొ జగన్ పార్టీ వైపు జంప్ చేశారు. తరువాత అక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఎదిగారు. వైసీపీ తరపున మొన్నటి ఎన్నికల్లో కూడా గెలిచిన రోజా మంత్రి పదవి ఆశించినా కొన్ని సమీకరణాల్లో భాగంగా ఆ పదవి దక్కలేదు. కానీ ఏపీఐఐసీసీ చైర్ పర్సన్ గా కీలకమైన బాధ్యతలు అప్పగించారు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్.

ఇదంతా ఒకెత్తు అయితే, ఆమె టెలివిజన్ రంగంలో సాధించిన గుర్తింపూ తక్కువ కాదు. వివాహ బాంధవ్యాల మధ్య వచ్చే కలతలనుంచి ఆలూమగలమధ్య ముదిరిపోయిన సమస్యలను తీర్చే రచ్చబండ లాంటి కార్యక్రమాలతో టీవీ వీక్షకులకూ దగ్గరయ్యారు. అయితే, ఈటీవీ జబర్దస్త్ కామెడీ షో మాత్రం రోజాకు విపరీతమైన గుర్తింపు తెచ్చింది. ఇదే ఆమె మీద రోజుకో కొత్త కథనాన్ని అల్లగలిగే అవకాశాన్నీ ఔత్సాహికులకు కల్పించింది.

ఇంతకీ రోజా మీద తరచూ వచ్చే గాలి వార్త ఏమిటి?

రోజా జబర్దస్త్ నుంచి ఔట్! ఇదే వార్త కనీసం రెండు నెలలకోసారన్నా మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక ఎన్నికల సమయం నుంచి వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత, రోజాకు కీలక బాధ్యతలు అప్పచెప్పిన తరువాత ఈ శీర్షిక తరచూ దర్శనమిస్తోంది. ఎపుడన్నా ఒక్క వారం ఆమె జబర్దస్త్ షో లో కనిపించని ప్రోమో వస్తే చాలు ఈ హెడింగ్ కు అదనంగా అదేనా కారణం.. జగన్ గట్టిగా చెప్పారు.. జగన్ కీ రోజాకీ మధ్య జబర్దస్త్ వార్ ఇలా ఎవరి క్రియేటివిటీకి తగ్గట్టు వాళ్లు ముఖ్యమైన వార్తలా తాయారు చేసి ప్రాచుర్యంలోకి తెచ్చేస్తున్నారు. తాజాగా ఈ వార్త మళ్లీ చక్కర్లు కొడుతోంది. రోజాకి జగన్ వార్నింగ్ అనేది ఆ వార్త సారాంశం. ఈ మధ్య రోజా జబర్దస్త్ లో కనిపించలేదు. అంతే.. ఈ వార్నింగ్ వార్త వైరల్ అయిపొయింది.

ఇందులో నిజమెంత?

ఇక ఇది రాజకీయాలకూ వినోదానికీ ముడిపడిన వార్త కావడంతో దీనిపై ట్రోలింగ్స్ కూడా ఎక్కువగానే జరుగుతుంటాయి. రెండు వర్గాలుగా సోషల్ మీడియా విడిపోయి ఎవరి వాదన వారు చేస్తూ వస్తున్నారు. నిజానికి జగన్ రోజాకి ఏ వార్నింగ్ ఇవ్వలేదు. ఈ విషయాన్ని రోజా ఇటీవల స్పష్టం చేశారు. ఇప్పుడే కాదు అసలు జబర్దస్త్ విషయంలో కానీ, రోజా నట జీవితం విషయంలో కానీ ముఖ్యమంత్రి కలుగ చేసుకునే అవకాశమే లేదనేది రోజాను సమర్థించే వారు చెప్పేమాట. ఇదే నిజం కూడాను. ఎందుకంటే, రాజకీయాల్లో కీలకంగానూ, ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లోనూ ఉన్నవారిలో కొద్ది మంది తప్ప దాదాపు అందరూ వారి వారి వ్యాపార వ్యవహారాలను చక్కపెట్టుకుంటూనే ఉన్నారు. వారివారి గురించి రాణి అభ్యంతరం ఒక్క రోజా విషయంలోనే వస్తుందని అనుకోవడం అవివేకమే. ఒకవేళ అటువంటిదే ఉంటే.. ఇప్పుడు మంత్రులుగా ఉన్నవారిలో చాలా మంది తమ వ్యాపారాల్ని వదిలేసుకోవాల్సి వస్తుంది. ఇది సుస్పష్టం.

అందువల్ల రోజా ను జబర్దస్త్ నుంచి జగన్ తప్పుకోమని హెచ్చరిస్తున్నట్టు పదే పదే వస్తున్న పులిహోర వార్తలు కచ్చితంగా నిజం కాదని చెప్పుకోవచ్చు. ఒకవేళ పని ఒత్తిడి ఎక్కువై రోజా తనంత తాను తప్పుకుంటే తప్ప.. జగన్ నుంచి అభ్యంతరాలు ఉన్నాయనే మాట అవాస్తవం అని విషయం తెలిసిన వారు చెబుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories