తెలంగాణ రాజకీయాల్లో.. స్టేట్ వర్సెస్ సెంట్రల్

తెలంగాణ రాజకీయాల్లో.. స్టేట్ వర్సెస్ సెంట్రల్
x
తెలంగాణ రాజకీయాల్లో.. స్టేట్ వర్సెస్ సెంట్రల్
Highlights

ఒకటేమో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. మరొకటి రాష్ట్రాన్ని ఏలుతున్న పార్టీ. ఇప్పుడా ఇరు పార్టీల మధ్య అసలు పొసగడం లేదు. పచ్చగడ్డి వేయకున్నా రెండు...

ఒకటేమో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. మరొకటి రాష్ట్రాన్ని ఏలుతున్న పార్టీ. ఇప్పుడా ఇరు పార్టీల మధ్య అసలు పొసగడం లేదు. పచ్చగడ్డి వేయకున్నా రెండు పార్టీల నాయకుల మధ్య మాటల మంటలు చెలరేగుతున్నాయి. నిధుల కేటాయింపు, రాష్ట్రాభివృద్ధిపై బీజేపీ, టీఆర్ఎస్ నాయకుల మధ్య డైలాగ్ వార్ మరింత రక్తికడుతోంది.

కేంద్ర బడ్జెట్‌ తర్వాత తెలంగాణలో పొలిటికల్ గేమ్ రెండు పార్టీల మధ్య నడుస్తోంది. రాష్ట్రంలో, కేంద్రంలో అధికార పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పటి నుంచి రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన నిధులకు సంబంధించిన లెక్కలు, లెక్కా పత్రాలంటూ ఇరు పార్టీల నాయకులు చెప్పుకుంటూ వస్తున్నారు. తాజాగా ఎంట్రీ ఇచ్చిన రైల్వే మంత్రి పియూష్ గోయల్‌ ఆటను మరింత రక్తి కట్టించారు.

తెలంగాణను కేంద్రం అసలు పట్టించుకోవడం లేదని రాష్ట్రం కడుతున్న పన్నులకు సమానమైన వాటా నిధులను ఇవ్వడం లేదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. టైమ్స్ నౌ కాన్ క్లేవ్లో మాట్లాడిన ఆయన రాష్ట్రం నుంచి కేంద్రానికి, కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధుల పంపిణీ లెక్కను విప్పి చెప్పారు.

అయితే కేంద్ర బడ్జెట్‌పై అన్ని రాష్ట్రాల్లో సదస్సులు నిర్వహిస్తున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఇదే అంశంపై మాట్లాడారు. తెలంగాణకు యూపీఏ హయాంలో కంటే మోడీ ప్రభుత్వంలోనే ఎక్కువ నిధులు అందాయని గత ఐదేళ్లలో లక్షా 7 వేల కోట్లు నిధులు రాష్ట్రానికి వచ్చినట్లు వివరించారు.

తాజాగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్‌ రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపాయి. రైల్వే శాఖ దక్షిణాదిని పట్టించుకోవడం లేదని నిధుల కొరతతో పలు ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ మూడో దశ పనులు వేగవంతం చేయాలని సూచించారు.

దీంతో అదే వేదికపై ఉన్న మంత్రి పియూష్ గోయల్ మంత్రి తలసాని వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు. తెలంగాణకు చేయాల్సిన సాయం, ఇవ్వాల్సిన నిధులు అన్నీ ఇస్తున్నామన్నారు. యూపీఏ హయాంలో కేటాయించిన నిధుల కంటే పది రెట్లకు పైగా నిధులు కేటాయింపులు చేశామన్నారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు ఆగలేదని ఛాలెజ్ చేసి చెబుతున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో కేంద్రానికి అనుకూలంగా ఉన్న రాష్ట్ర సర్కారు ఈ దఫా మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా వెళ్తోంది. తాజాగా సీఏఏ పై కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా మంత్రిమండలిలో తీర్మానం కూడా చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర నాయకుల మధ్య మాటల యుద్ధం ఎక్కడి వరకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories