విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనలు

విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనలు
x
Highlights

కరోనా విజృంభణతో విధించిన లాక్‌డౌన్ వల్ల విద్యార్థులకు చదువు విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు అంశాలపై కీలక...

కరోనా విజృంభణతో విధించిన లాక్‌డౌన్ వల్ల విద్యార్థులకు చదువు విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు అంశాలపై కీలక ప్రకటనలు చేశారు. విద్యా రంగంలో ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌కు భారీ ఎత్తున ప్రోత్సాహం అందిస్తామన్నారు.

కరోనా మహమ్మారి ప్రజా జీవనాన్ని కకావికలం చేసిన నేపథ్యంలో దేశంలో అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. దేశ వ్యాప్తంగా అన్ని స్థాయిల్లో విద్యారంగం నష్టపోయింది. విద్యార్దులు చదువుకు దూరమయ్యారు.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా రంగం కోసం 12 స్వయం ప్రభ ఛానళ్లను ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బధిర విద్యార్థుల కోసం ప్రత్యేక ఛానల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న మూడు విద్యా రంగ ఛానెళ్లకు అదనంగా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

విద్యార్థుల కోసం కరిక్యులమ్, ఆన్‌లైన్ కరిక్యులమ్ సదుపాయాలు కల్పిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. అలాగే, ఇతర విద్యార్థులకు ఆన్‌లైన్‌ కోర్సుల కోసం 100 ప్రధాన యూనివర్సిటీలకు ఆటోమేటిక్ విధానంలో అనుమతులు ఇస్తామని చెప్పారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య పరస్పర సంభాషణకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. కమ్యూనిటీ రేడియోలతో పాటు బ్రాడ్‌కాస్ట్‌ విధానంలో పిల్లలకు విద్యా బోధన చేస్తామని తెలిపారు. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రతి తరగతికి ఒక ఛానల్ ఉంటుందని కీలక ప్రకటన చేశారు.

కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రజలను భయాకందోళనల నుంచి దూరం చేసేందుకు సైకలాజికల్ కౌన్సెలింగ్ తరగతులు ఇప్పిస్తామని కూడా నిర్మలా సీతారామన్ తెలిపారు. పిల్లలు, ఉపాధ్యాయులతో పాటు కుటుంబాలకు కూడా కౌన్సెలింగ్ అందేందుకు ప్రోత్సహిస్తామని తెలిపారు.

ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీ-5 వివరాలను వెల్లడించిన నిర్మలా సీతారామన్ దేశంలో వైద్య పరికరాల తయారీ సంస్థలను బలోపేతం చేస్తామన్నారు. కోవిడ్‌-19 నేపథ్యంలో దేశవ్యాప్త వైద్య సదుపాయాల ఏర్పాటుకు ఇప్పటికే 15 వేల కోట్లు ప్రకటించినట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

దేశంలో వైద్య పరికరాల తయారీ సంస్థలను బలోపేతం చేస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వైద్య సదుపాయాల కోసం 4,113 కోట్లు రాష్ర్టాలకు అందించినట్లు తెలిపారు. అదేవిధంగా టెస్టు కిట్లు, తదితర అవసరమైన వస్తువుల కోసం రూ. 3,750 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. టెస్టింగ్‌ ల్యాబ్‌లు, కిట్స్‌ల కోసం మరో 550 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. కరోనా సమయంలోనే 300 కు పైగా పీపీఈ కిట్ల తయారీ పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయన్నారు. ఆరోగ్యరంగంలో పనిచేసే సిబ్బందికి 50 లక్షల చొప్పున బీమా కల్పించామన్నారు.

కేంద్రం నుంచి రాష్ర్టాలకు 51 లక్షల పీపీఈ కిట్లు, 87 లక్షల ఎన్‌-95 మాస్కులు, 11 కోట్లకు పైగా హైడ్రో క్లోరోక్విన్‌ మాత్రలను సరఫరా చేసినట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో సాంక్రమిక వ్యాధుల ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఆరోగ్య సంక్షోభం ఎదుర్కొనేందుకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో వైద్య సదుపాయాల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి పరచడం. ల్యాబ్‌ నెట్‌వర్క్స్‌ను పటిష్ట పరచడం కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. కోవిడ్‌ అనుభవాల నేపథ్యంలో భవిష్యత్‌లోనూ సంక్షోభాలు ఎదుర్కొనేందుకు భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. వైద్య పరిశోధనల కోసం ఐసీఎంఆర్‌ ద్వారా అదనపు నిధులు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

ఆరోగ్య పరిరక్షణకు సంస్కరణలను ఆవిష్కరించిన ఆర్ధిక మంత్రి జిల్లా,బ్లాక్ స్థాయిలో సమీకృత పరీక్షా కేంద్రాల ఏర్పాటు సహా పరిశోధనలకు ప్రోత్సాహకాలు ప్రకటించడం ఎంతో శుభపరిణామనని నిపుణులు చెబుతున్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories