లాక్‌డౌన్‌కు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల

లాక్‌డౌన్‌కు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల
x
Highlights

దేశంలో కరోనా వ్యాప్తిని నివారించేందుకు లాక్ డౌన్ ఎంతో ఉపయుక్తం అని భావిస్తున్న కేంద్రం మరోసారి లాక్ డౌన్ పొడిగించింది. తాజాగా నాలుగో విడత లాక్...

దేశంలో కరోనా వ్యాప్తిని నివారించేందుకు లాక్ డౌన్ ఎంతో ఉపయుక్తం అని భావిస్తున్న కేంద్రం మరోసారి లాక్ డౌన్ పొడిగించింది. తాజాగా నాలుగో విడత లాక్ డౌన్‌‌ను ఈ నెల 31 వరకు అమలు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు సడలింపులతో కూడిన నూతన మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది.

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ మే 31 వరకు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది. లాక్‌డౌన్-4లో మరిన్ని సడలింపులు ఇస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. కంటైన్మెంట్‌, రెడ్‌, గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లపై నిర్ణయాధికారం రాష్ట్రాలకే అప్పగించింది. కరోనా హాట్‌స్పాట్లలో ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. కంటెయిన్‌మెంట్ జోన్లలో అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొంది.

రాష్ట్రాల పరస్పర అనుమతితో అంతర్రాష్ట బస్సు సర్వీసులకు నడుపుకోవచ్చునని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. ప్రేక్షకులు లేకుండా క్రీడా మైదానాలను తెరుచుకోవచ్చునని తెలిపింది. హోటళ్లు, రెస్టారెంట్లు, విద్యా సంస్థలు మే 31 వరకు మూసివేసి ఉంచాలని పేర్కొంది. మెట్రో రైలు సర్వీసులను మే 31 వరకు ప్రారంభించకూడదని స్పష్టం చేసింది.

సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు, స్విమ్మింగ్ పూల్స్ మూసివేతపై మే 31 వరకు ఆంక్షలు కొనసాగుతాయని కేంద్ర హోంశాఖ స్పష్ఠం చేసింది. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో గుంపులుగా పాల్గొనవద్దని తెలిపింది. రాజకీయ, సామాజిక సభలపై నిషేధం కొనసాగుతుందని హోంశాఖ స్పష్టం చేసింది.

దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం కొనసాగుతుందని దేశీయ విమానాల్లో వైద్య సేవలకు అనుమతి ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. హోటళ్లను, లాడ్జీలను వైద్య, ఆరోగ్య, పోలీసు సిబ్బందికి కేటాయించినట్టయితే వాటిని తెరవొచ్చని కేంద్ర హోంశాఖ వెల్లడించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories