కొండా కపుల్స్‌కు కమలం వెల్‌కం సాంగ్‌ వినిపిస్తోందా?

కొండా కపుల్స్‌కు కమలం వెల్‌కం సాంగ్‌ వినిపిస్తోందా?
x
Highlights

కొండనైనా పిండి చేసే బలం తమకుందన్నారు. కానీ బండను కూడా కొట్టలేకపోయారు. ఓరుగల్లు కోటలో సత్తా చాటుతామని, పత్తాలేకుండాపోయారు. ఒకానొక ఓటమి, ఆ మాస్‌...

కొండనైనా పిండి చేసే బలం తమకుందన్నారు. కానీ బండను కూడా కొట్టలేకపోయారు. ఓరుగల్లు కోటలో సత్తా చాటుతామని, పత్తాలేకుండాపోయారు. ఒకానొక ఓటమి, ఆ మాస్‌ లీడర్లను మరుగునపడేలా చేసింది. అందుకే ఇప్పుడు ఆ దంపతులు అనువుగాని చోట ఉండటం ఎందుకని, మరోసారి కండువా మార్చేందుకు సిద్దమవుతున్నారన్న ఊహాగానం సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ ఆ మాస్‌ కపుల్ ఎవరో అర్థమైంది కదా కొండా దంపతులు. ఓరుగల్లు కోటలో ఎదురులేని కొండా దంపతులు నిజంగానే పార్టీ మారతారా.. కమలం తోటలో వికసిస్తారా?

తెలంగాణలో నాలుగు ఎంపీ స్థానాలు గెలిచి ఫుల్‌ జోష్‌లో ఉన్న భారతీయ జనతా పార్టీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికలనే లక్ష్యంగా పెట్టుకుంది. మొన్న ఏకంగా సభ్యత్వ నమోదుకు తెలంగాణకు వచ్చిన అమిత్‌ షా, పవర్‌ ఫుల్‌ లీడర్ల కోసం అన్వేషించాలని కర్తవ్యబోధ చేశారట. టీడీపీ, కాంగ్రెస్‌, చివరికి టీఆర్ఎస్‌లోనూ బలమైన నాయకుల కోసం వేట మొదలుపెట్టాలని, స్టేట్‌ లీడర్లకు ఉపదేశించారట. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన సీనియర్ నేతలకు కాషాయ కండువా కప్పారు. అదే బాటలో మరికొంత మంది ప్రముఖ నేతలు ఉన్నారని, త్వరలో వీరంతా కాషాయ తీర్థం పుచ్చుకోబోతున్నారని బీజేపీ ముఖ్య నేతలు పూర్తి విశ్వాసంతో చెబుతున్నారు. వారిలో వరంగల్‌కు చెందిన కొండా దంపతులు ఉన్నారన్న ఊహాగానం రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.

అధికార టీఆర్ఎస్ పార్టీని జిల్లాల వారిగా ఎదుర్కొనే సమర్ధవంతమైన నాయకులు ఎవరనే దానిపై, బీజేపీలో తీవ్ర కసరత్తే జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్‌కి కంచుకోటగా ఉన్న వరంగల్‌లో, బీజేపీని బలోపేతం చేసే మాస్‌ లీడర్ల కోసం వేట ముమ్మరం చేశారు. అందులో భాగంగానే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కొండా దంపతులపై ఆపరేషన్ లోటస్ మొదలుపెట్టినట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే బీజేపీకి చెందిన జాతీయస్థాయి నేత వారికి బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు జిల్లాలో హాట్‌ హాట్‌గా చర్చ జరుగుతోంది. కొండా దంపతులతో పాటు తమ కూతురికి పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పిస్తేనే ఆలోచిస్తాం అన్నట్టుగా జిల్లాలో ప్రచారం సాగుతోంది. దీనికి తోడు ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం, పార్టీ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో, కొండా దంపతుల కాషాయ ఎంట్రీ ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోంది. ఈ వార్తలను వారు ఖండించకపోవడం కూడా పార్టీ మార్పు ప్రచారానికి ఊతమిస్తోంది.

వరంగల్‌ కొండా దంపతుల బాటలోనే టిడిపికి చెందిన రేవురి ప్రకాష్ రెడ్డి, ఈగ మల్లేశం, కాంగ్రెస్ ఎర్రబెల్లి స్వర్ణ దంపతులు, మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి లాంటి కీలక నేతలతో పాటు, పలువురు కిందిస్థాయి నేతలు కూడా క్యూలో ఉన్నట్టు చర్చ జరుగుతోంది. మొన్నటి ఎన్నికల్లో అనూహ్యంగా కమలం పార్టీకి నాలుగు ఎంపీ స్థానాలు దక్కడంతో తెలంగాణపై జాతీయ నాయకత్వం పూర్తి స్థాయి దృష్టి సారించింది. ఎన్నికల్లో మున్నూరుకాపు సామాజిక వర్గం నుంచి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గెలుపొందారు. దీంతో ఇదే అదనుగా భావించి పనిలో పనిగా టీఆర్ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డీఎస్‌ను కూడా పార్టీలోకి తీసుకున్నట్లయితే, తన సామాజికవర్గంతో పాటు కాంగ్రెస్‌లో తన శిష్యులను వెంట తీసుకువస్తాడని బీజేపీ నాయకత్వం లెక్కలేస్తోంది. అందులో భాగంగానే ఇటీవల రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణను ఇద్దరు ఎంపీలు స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. ఇదే తరహాలో మిగతా జిల్లాల్లోనూ చరిష్మా కలిగిన నేతలే టార్గెట్‌గా పావులు కదుపుతోంది బీజేపీ.

మొత్తానికి ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తిగా సైలెంటయ్యారు కొండా దంపతులు. కాంగ్రెస్‌లో నైరాశ్యం నెలకొనడంతో ఎటూపాలుపోవడం లేదు వారికి. అందుకే కమలం ఆకర్ష్ మంత్రం వేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఒకవేళ కొండా కపుల్స్ పార్టీ మారినా, అనుచరగణం కండువా మారుస్తారా లేదంటే కాంగ్రెస్‌లోనే ఉంటారా అన్నది ఆసక్తిగా మారింది. కొందరు మాత్రం, వారు మారినా, తాము మాత్రం మారేది లేదని తెగేసి చెబుతున్నారని తెలుస్తోంది. మొత్తానికి అనువుగాని చోట ఏమాత్రం ఉండలేని కొండా దంపతులే కమలంవైపు చూస్తున్నారా.. లేదంటే కొండా నిస్సహాయతే ఆసరాగా బీజేపీ గాలం వేస్తోందో తెలీదు కానీ, వారు పార్టీ మారుతారన్న ప్రచారం మాత్రం గట్టిగా వినిపిస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories