పసుపులో 15 దేశవాళీ రకాలు

పసుపులో 15 దేశవాళీ రకాలు
x
Highlights

వినూత్నంగా సాగు చేయాలనే ఆలోచన ఎవరూ చేయనన్ని రకాలను సాగు చేయాలనే ఉత్సాహం. ఆ కోవలోనే అందరిలా ఆలోచించకుండా వినూత్నంగా పసుపు సాగు చేపట్టాడు ఆ రైతు అది...

వినూత్నంగా సాగు చేయాలనే ఆలోచన ఎవరూ చేయనన్ని రకాలను సాగు చేయాలనే ఉత్సాహం. ఆ కోవలోనే అందరిలా ఆలోచించకుండా వినూత్నంగా పసుపు సాగు చేపట్టాడు ఆ రైతు అది కూడా ప్రకృతి సాగు విధానంలో. ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ ఉన్న కొత్త వెరైటీలను పరిచయం చేశాడు. తనకున్న 11 ఎకరాల భూమిలో 15 రకాల పసుపు సాగు చేస్తూ భేష్ అనిపించుకుంటున్నాడు ఆ రైతు. పసుపు సాగులో ప్రత్యేకత చాటుకుంటున్న సిద్దిపేట జిల్లాకు చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు పై ప్రత్యేక కథనం.

సిద్దిపేట జిల్లా కలువల గ్రామానికి చెందిన రైతు ఘంట దామోదర్ రెడ్డి కుటుంబ నేపథ్యం ముందు నుండి వ్యవసాయమే రసాయనిక సేద్యంలో ఒడిదుడుకులు చూసిన ఆయన సుభాష్ పాలేకర్ ప్రేరణతో పూర్తి స్థాయి ప్రకృతి విధానంలో సాగు ప్రారంభించాడు. ఎలాంటి రసాయనాలు వాడకుండా సమగ్ర పద్ధతిలో 15రకాల పసుపు, అంతర పంటలు సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

పసుపు సాగులో వినూత్న పద్దతిని అవలంభిస్తు నూతన వెరైటీలను సాగు చేస్తున్నాడు. తనకున్న పదకొండెకరాల్లో 15 రకాల పసుపును సాగు చేస్తున్నాడు. విదేశాల్లో డిమాండ్ ఉండే రకాలను ఇతర ప్రాంతాల నుంచి విత్తనాలు తీసుకొచ్చి సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం ఇతర ప్రాంతాల రైతులకు కొత్త వెరైటీ పసుపును విత్తనాలుగా అందించే స్ధాయికి ఎదిగాడు. ప్రకృతి విధానంలో దేశీ విత్తనాల పసుపు మొక్కలకి చీడపీడల బెడద తక్కువనీ దేశవాళీ రకాల్లో పసుపు లాభదాయక దిగుబడి లభిస్తుందని అంటున్నాడు ఈ రైతు.

పాలేకర్ సాగు విధానాల్లో రైతులకు లాభాలు తెచ్చిపెట్టే మార్గం అంతర పంటల విధానం. ఒకవైపు పసుపను సాగు చేస్తూనే మిశ్రమ పంటల విధానం అవలంభిస్తున్నాడు రైతు దామోదర్ రెడ్డి. బీజామృతాలతో విత్తన శుద్ధి ని పాటిస్తూ చీడపీడలకు పుల్ల మజ్జిగ, నీమాస్త్రం, వంటి కషాయాలను వాడుతూ కలుపు నివారణకు మల్చింగ్ పద్దతిని అవలంభిస్తున్నాడు ఈ రైతు.


Show Full Article
Print Article
Next Story
More Stories