ఎక్కువ సంపాందించాలంటే ఈ జాతి గోర్రెలు మేలు.. ప్రతి నెల ఒక్కో గొర్రె 4 కిలోలు పెరుగుతుంది..

Sheep Farming in Modern Methods
x

ఎక్కువ సంపాందించాలంటే ఈ జాతి గోర్రెలు మేలు.. ప్రతి నెల ఒక్కో గొర్రె 4 కిలోలు పెరుగుతుంది.. 

Highlights

Sheep Farming: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం, కడ్తాల్ గ్రామానికి చెందిన కడారి రామకృష్ణ వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో గొర్రెల పెంపకాన్ని మొదలుపెట్టారు.

Sheep Farming: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం, కడ్తాల్ గ్రామానికి చెందిన కడారి రామకృష్ణ వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో గొర్రెల పెంపకాన్ని మొదలుపెట్టారు. మార్కెట్‌లో డిమాండ్ ఉండటం, తక్కువ ఖర్చుతో మంచి లాభాలు పొందే అవకాశం ఉండటంతో ప్రారంభంలో మెళకువలు తెలియక, అధిక మొత్తంలో గొర్రెలను పెంచి నష్టాలను చవిచూశారు. ఆ తరువాత లోపం ఎక్కడుందో గుర్తించి ప్రణాళిక ప్రకారం గొర్రెలను స్టాల్ ఫీడింగ్ పద్ధతిలో పెంచుతూ లాభాలను సొంతం చేసుకుంటున్నారు. గత 20 ఏళ్లుగా జీవాల పెంపకంలో రాణిస్తున్నారు రామకృష్ణ. గొర్రెల పెంపకం లాస్ లేనిదని వద్దనుకున్న మరుక్షణమే అమ్మతే పెట్టిన పెట్టుబడి గ్యారెంటీగా చేతికందుతుందని తెలిపారు. మరణాల శాతాన్ని నియంత్రించి , పశువైద్యుల సూచనలు పాటించి, సమయానుకూలంగా మేతలు అందించి, సరైన యాజమాన్య చర్యలు చేపడితే లాభాలు ఎక్కడికీ పోవంటున్నారు.

మూడు నుంచి నాలుగు నెలలు పైబడిన పిల్లలను మాత్రమే పెంపకానికి ఎన్నుకోవాలని రామకృష్ణ సూచిస్తున్నారు. చిన్న పిల్లలను తీసుకువస్తే ఆరోగ్య సమస్యలతో పాటు స్థానిక వాతావరణాన్ని తట్టుకోలేక మరణాల శాతం పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు. అందుకే పిల్లల ఎంపికలో జాగ్రత్తలు తప్పనిసరిపాటించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి పిల్లకు సంవత్సరంలో మూడు సార్లు తప్పనిసరిగా కాలానుగుణంగా నట్టల మందులు వేయించాలని, ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే పశువైద్యుని సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

గొర్రెల్లో చాలా రకాలు ఉన్నాయి. కమర్షియల్‌గా పెంచాలనుకునే రైతులు నెల్లూరు జొడిపి, నెల్లూరు బ్రౌన్, పల్లా, మాచర్ల బ్రీడ్ రకాలను ఎంపిక చేసుకోవాలంటున్నారు రామకృష్ణ. మంచి పోషణ అందిస్తే ఒక్కో గొర్రెపిల్ల ఒక నెలకు సుమారు 4 కిలోల నుంచి 5 కిలోల బరువు పెరుగుతాయంటున్నారు. విదేశీ జాతులు ఉన్నప్పటికీ వాటి క్రయవిక్రయాలు ఆశాజనకంగా ఉండనందున వాటి జోలికి వెళ్లవద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా స్టాల్ ఫీడింగ్‌లో పెంచాలనుకునే రైతులు ఏప్రిల్, మే నెల్లలో గొర్రెలను కొనుగోలు చేయాలని తెలిపారు. ఆ సమయంలో బయట ఎలాంటి మేతలు దొరకవు కాబట్టి మనం అందిందే మేతలను తినేందుకు అవి అలవాటు పడతాయన్నారు. ఎన్ని గొర్రెలను పెంచాలనుకుంటున్నారో ముందే ఆలోచించి అందుకు అనుగుణంగా తక్కువ ఖర్చు షెడ్డును నిర్మించుకుని , గొర్రెల పెంపకానికి అవసరమైన పరికరాలను ఏర్పరుచుకని రెండు విడతలుగా గొర్రెలను తెచ్చి పెంపకం చేపట్టాలన్నారు. ముఖ్యంగా వాణిజ్య సరళిలో పెంచే రైతులు లాభాలను పొందాలంటే వంద లోపు గొర్రెలను పెంచాలని సూచిస్తున్నారు.

వంద గొర్రెలను పెంచాలనుకునే పెంపకందారులు ముందుగా ఎకరంన్నర విస్తీర్ణంలో రెండు నెలల ముందే గ్రాసాలను సాగు చేసుకోవాల్సి ఉంటుంది. సూపర్ నేపియర్, ఏఎఫ్ఎస్‌ 29,హెడ్జ్ లూసర్న్ వంటి గ్రాసాలను రామకృష్ణ పెంచుతున్నారు. ఇక జీవాల బరువు పెరిగేందుకు ఆరు రకాల మిశ్రమాలను కలిపి పోషక దాణాను సమయానుకూలంగా అందిస్తున్నారు. ఉదయం లేవగానే షెడ్డును శుభ్రం చేసుకుని ఒక్కో పిల్లకు 50 గ్రాముల మేత ఇవ్వాల్సి ఉంటుంది. మేతగా పల్లి పొట్టును అందిస్తున్నారు ఈ పెంపకందారు. అరగంట తరువాత పచ్చిగడ్డి ఇచ్చి , 24 గంటలు టబ్బుల్లో తాగడానికి నీటిని అనుకూలంగా ఉంచుతారు. బయట వదలడం కన్నా స్టాల్ ఫీడింగ్ లో పెంచితేనే గొర్రె పిల్ల బరుపు బాగా పెరిగి రైతుకు లాభం దక్కుతుందని తెలిపారు రామకృష్ణ

స్టాల్ ఫీడింగ్‌లో పెంచే గొర్రెలను లైవ్ వెయిట్ ప్రాకారం అమ్మాలంటున్నారు ఈ పెంపకందారు. బయట తిరిగే జీవాలు బాగానే ఉన్నా వాటి బరువు అధికంగా ఉండవు. కానీ ఇలా స్టాల్ ఫీడింగ్ లో పెరిగి గొర్రెల బరువు అధికంగా ఉంటాయన్నారు. పది నెలల్లో 90 కిలోలు వచ్చిన గొర్రెలు కూడా రామకృష్ణ షెడ్డులో కనిపిస్తాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories