వెద పద్ధతిలో వరి సాగు : ఆదర్శంగా సాఫ్ట్ వేర్ యువరైతు

Paddy Cultivation in Natural Farming
x
Highlights

వరిలో మూస పద్ధతికి స్వస్తి చేపుతూ ప్రత్యక్ష సాగుకు ఆసక్తి చూపుతున్న రైతుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. సాగులో పెట్టుబడులు తగ్గడం, నాట్లకు ముందు...

వరిలో మూస పద్ధతికి స్వస్తి చేపుతూ ప్రత్యక్ష సాగుకు ఆసక్తి చూపుతున్న రైతుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. సాగులో పెట్టుబడులు తగ్గడం, నాట్లకు ముందు చేయాల్సిన పొలం పనులేవీ చేయాల్సిన పనిలేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఆ కోవలోనే వెదజల్లే విధానంలో వరి సాగు చేస్తున్నాడు ఓ సాఫ్ట్ వేర్ రైతు. లక్షల ప్యాకేజీ గల సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న కరీంనగర్ జిల్లా చెందిన యువ రైతు మల్లికార్జున రెడ్డిపై ప్రత్యేక కథనం.

కరీంనగర్ జిల్లా కుర్మపల్లి గ్రామానికి చెందిన యువ రైతు మల్లికార్జున రెడ్డికి చేస్తున్న ఉద్యోగం సంతృప్తివ్వలేదు లక్షల్లో జీతం మనసును కుదుటగా ఉండనివ్వలేదు ఆరోగ్యకర ఆహారాన్ని పండించాలి, అందరికి అందించాలనే తపనతో ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాడు. ఆ క్రమంలోనే వెద పద్ధతిలో వరి సాగు చేస్తూ లాభాల బాటలో ముందుకు సాగుతున్నాడు. వెద సాగు అంటేనే నారు పెంచే పని ఉండదు. నారుమడికి ఎరువు పెట్టాల్సిన అవసరమూ రాదు, వరినారు తీసేందుకు కూలీలకు అవస్థ పడాల్సిన అవసరమూ లేదంటున్నారు రైతు మల్లికార్జున రెడ్డి. అయితే ఈ క్రమంలో సాధారణ సాగుకు, వెద సాగుకు మధ్యన సాగు ఖర్చులు ఏ విధంగా ఉంటాయి ? రైతులకు ఈ పద్ధతిలో ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయి ? మరి ఈ ప్రకృతి విధానంలో వెద సాగు గురించి రైతు అనుభవాలు మనమూ తెలుసుకుందాం.


Show Full Article
Print Article
Next Story
More Stories