Telangana: నాటుకోళ్ల పెంపకానికి ప్రభుత్వ ప్రోత్సాహం

Government incentives for Natu Kolla Pempakam
x

Telangana: నాటుకోళ్ల పెంపకానికి ప్రభుత్వ ప్రోత్సాహం

Highlights

Telangana: అత్యంత పోషక విలువలు, రోగ నిరోధక శక్తి కలిగిన భారతీయ పెరటి జాతి నాటు కోడికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.

Telangana: అత్యంత పోషక విలువలు, రోగ నిరోధక శక్తి కలిగిన భారతీయ పెరటి జాతి నాటు కోడికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఈ నాటు కోడి మాంసం, గుడ్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు. జీర్ణశక్తి పెరగడంతో పాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇక మాంసంతో పోల్చితే గుడ్లలో పోషక విలువలు మరింత అధికంగా ఉంటాయి. ఈ నేపధ్యంలో నాటుకోళ్ల పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. పెంపకానికి ముందుకు వచ్చే వారికి ప్రత్యేక రాయితీలను అందిస్తోంది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో రైతులకు పెరటి కోళ్ల పెంపకానికి పెద్ద ఎత్తున సబ్సిడీపై యూనిట్లను అందజేసేందుకు జిల్లా పశువైద్యాధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. మొదటి దశలో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా కొండమల్లెపల్లి మండలాన్ని ఎన్నిక చేశారు.

నాటుకోళ్ల పెంపకానికి ముందుకు వచ్చే రైతులకు ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వినియోగదారులకు పౌష్టికాహారమైన నాటుకోళ్ల మాంసాన్ని అందించడంతో పాటు రైతులను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో సబ్సిడీపై పెరటికోళ్ల యూనిట్‌లను అందజేయనుంది. ఇందుకోసం నల్గొండ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 350 యూనిట్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం మార్కెట్‌లో పెరటి కోళ‌ల మాంసానికి , గుడ్లకు మంచి గిరాకీ ఉంది. నాటుకోడి మాంసం, గుడ్లు పౌష్టికాహారం కావడంతో వాటి పెంపకంపై రైతులను మరింతగా ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కో పెరటి కోడి కిలోకు 350 రూపాయల నుంచి 400 రూపాయల వరకు ఉండటం, అంతేకాకుండా వాటికి మంచి గిరాకీ ఉండటంతో రైతులు ఆర్ధికాభివృద్ధి సాధిస్తారని ఆశిస్తోంది.

నల్గొండ జిల్లాలో రైతులకు పెరటికోళ్ల పెంపకానికి సబ్సిడీపై యూనిట్లు అందజేయాలని జిల్లా పశువైద్య సంవర్థక శాఖ నిర్ణయించింది. నిధులను మంజూరు చేయించింది. ఒక్కో యూనిట్‌లో నాలుగు వారాల వయసున్న 200ల కోడిపిల్లలను అందించనున్నారు అధికారులు. ఒక్కో యూనిట్ విలువ 29 వేల రూపాయలు కాగా , సబ్సిడీ 25వేలు. ఇక మిగతా 4 వేల రూపాయలు రైతు తన వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. మొదటి దశలో పైలట్ ప్రాజెక్టుగా కొండమల్లెపల్లి మండలంలోని గౌరికుంట తండా , గుమ్మడివెల్లి గ్రామాలతో పాటుగా కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామాలను జిల్లా పశువైద్య సంవర్థక శాఖ ఎంపిక చేసింది.

ఎస్సీ, ఎస్టీ రైతులను 65 మందిని ఇప్పటికే ఎంపిక చేసి యూనిట్లు అందజేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ కోళ్ల పెంపకం విజయవంతమైతే మిగిలిన యూనిట్లు జిల్లాలోని అన్ని మండలాల్లో రైతులను ఎంపిక చేసి పెరటికోళ్ల యూనిట్లు అందజేయాలని భావిస్తున్నారు. వరంగల్ జిల్లాలోని ముమునూరు ప్రభుత్వ పౌల్ట్రీ ఫామ్ నుంచి కోడి పిల్లలను తెప్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన గ్రామాల్లోని రైతుల ఎంపిక పూర్తైంది. వారికి త్వరలో యూనిట్లు అందజేయనున్నారు. పెద్ద మొత్తంలో సబ్సిడీ ఉన్నందున రైతులు పెరటికోళ్ల పెంపకానికి పెద్దఎత్తున దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories