Cotton Farming in Telangana: తెల్లబంగారం పండించి రైతే రాజు కావాలంటున్న ప్రభుత్వం

Cotton Farming in Telangana: తెల్లబంగారం పండించి రైతే రాజు కావాలంటున్న ప్రభుత్వం
x
Highlights

Cotton Farming in Telangana : ఒకప్పుడు ఆ ప్రాంతంలో నిత్యం రైతుల ఆత్మహత్యలు అనునిత్యం రైతు కుటుంబాల ఆర్తనాదాలు వెంటాడే కరువు. వేధించే అప్పులతో రైతులు...

Cotton Farming in Telangana : ఒకప్పుడు ఆ ప్రాంతంలో నిత్యం రైతుల ఆత్మహత్యలు అనునిత్యం రైతు కుటుంబాల ఆర్తనాదాలు వెంటాడే కరువు. వేధించే అప్పులతో రైతులు నరకయాతన అనుభవించారు. కరెంట్ కోతలు, నకిలీ విత్తనాలు, చీడ పురుగు బెడద రైతులను నిరుత్సాహ పరిచాయి. కానీ ఇప్పుడు రోజులు మారాయి. వ్యవసాయమే దండుగ అన్న రైతులే పండుగలా వ్యవసాయం చేసుకుంటున్నారు. రైతుల జీవితాలతో చెలగాటమాడిన ఆ పంటే ఇప్పుడు రైతు కుటుంబానికి భరోసాగా నిలుస్తోంది. ఒకప్పుడు రైతుల పాలిట శాపంగా మారిన పంట ఇప్పుడు వరంగా ఎలా మారింది.

తెలంగాణ జిల్లాల్లో ఒకప్పుడు పత్తి రైతులకు ఆత్మహత్యలే శరణ్యం. కానీ ఇప్పుడు రైతులంతా పత్తిపంట వైపే మొగ్గు చూపుతున్నారు. పత్తిసాగు అంటేనే భయపడే రైతులు ఇప్పుడు సంబురంగా సాగు చేస్తున్నారు. ఇంతకు పత్తికి అంతలా డిమాండ్ ఎందుకు పెరిగింది. ప్రభుత్వం కూడా పత్తినే సాగు చేయాలంటూ ఎందుకు ప్రచారం చేస్తోంది.

ఉత్తర తెలంగాణలో రైతులు వాణిజ్య పంటలనే ఎక్కువగా నమ్ముకుంటారు. అందుకు ఆ ప్రాంత భూములు కూడా అనుకూలంగా ఉంటాయి. వాణిజ్య పంటలో ఎక్కువగా పత్తినే ఎక్కువగా సాగు చేసేవారు. కానీ ఆ పంట రైతులకు శాపంగా మారింది. గిట్టుబాటు ధర లేక. పెట్టిన పెట్టుబడి రాక ఆత్మహత్యలే దిక్కయ్యేవి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆ పంటనే వేయమంటోంది. తెల్లబంగారాన్ని పండించి రైతుల రాజు కావాలంటూ పిలుపునిస్తోంది. దీంతో ఈ ప్రాంత రైతాంగం పత్తి సాగుపై దృష్టిపెట్టింది. తెలంగాణ ప్రాంతంలో బీడు భూములకు కొదవే లేదు. సాగుకు యోగ్యమైన భూమి చాలా తక్కువ. ఒకవేళ ఉన్నా నీళ్లు ఉండవు. నీళ్లు ఉన్నా కరంట్ ఉండదు. ఇక అన్ని సదుపాయాలున్నా రైతులకు పెట్టుబడి దొరకదు. అందుకే చాలా మంది రైతులు తమ వ్యవసాయ భూములను వదిలేసి వలసెల్లిపోయేవారు.

ఇలాంటి దుర్భర పరిస్థితులు వరంగల్ జిల్లాలో అడుగడుగునా కనిపించేవి. పత్తిరైతులు అప్పుల పాలై, ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కొకొల్లలు. సాగునీరు, ఎరువులు, మద్దతు ధర లేకపోవడంతోనే రైతులకు ఆ దుస్థితి వచ్చేది. కానీ ఇప్పుడు స్వరాష్ట్రంలో పత్తిరైతులు ధైర్యంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత ఆరేళ్లలో వ్యవసాయం రంగంలో పెను మార్పులు సంభవించాయి. రైతు రాజును చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు ప్రవేశపెట్టింది. ఫలితంగా రైతుల కష్టాలు గట్టెక్కాయి. కొంతమేర ఆత్మహత్యలు ఆగిపోయాయి. ఇప్పుడు అన్నదాతలు ఆనందంగా వ్యవసాయం చేసుకుంటున్నారు.

వ్యాపార రంగంలో గణనీయమైన పెట్టుబడులు పెరిగాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో పండే పత్తిపంటకు అంతర్జాతీయ మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. అయితే ఈ ఏడాది ప్రభుత్వం కూడా రైతులను ఆదుకునేందుకు ప్రత్యేకంగా నూతన వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టింది. పత్తి పంట వేయాలని రైతులకు సూచిస్తోంది. ఇన్ని ప్రయోజనాల నేపథ్యంలో రైతులు పత్తిపంట సాగువైపే మొగ్గు చూపుతున్నారు. ఏకంగా ఈ సీజన్ లో ఏకంగా 18 లక్షల హెక్టార్లలో పత్తి పంట సాగు జరుగుతోంది. అయితే ప్రభుత్వ సూచన మేరకు పత్తి సాగు చేస్తున్న రైతుల్లో కొందరు అందోళనలో ఉన్నారు. గత ఏడాది పత్తి మొక్కలను గులాబీ రంగు పురుగు పూర్తిగా నాశనం చేసింది. ఆ సమయంలో పూర్తిగా నష్టాలను చవిచూశామని మళ్లీ ఇప్పుడు ప్రభుత్వం పత్తి పంట వేయాలని సూచిస్తుందని అంటున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories