ప్రకృతి విధానంలో తైవాన్ జామ సాగు

ప్రకృతి విధానంలో తైవాన్ జామ సాగు
x
Highlights

కరవు జిల్లాలో కనకవర్షం కురిపిస్తోంది తైవాన్ జామ ఇన్నాళ్లు కష్ట నష్టాలను చవిచూసిన రైతుకు ఆర్ధిక భరోసాను కల్పిస్తోంది. ప్రకృతి విధానంలో జామను సాగు...

కరవు జిల్లాలో కనకవర్షం కురిపిస్తోంది తైవాన్ జామ ఇన్నాళ్లు కష్ట నష్టాలను చవిచూసిన రైతుకు ఆర్ధిక భరోసాను కల్పిస్తోంది. ప్రకృతి విధానంలో జామను సాగు చేస్తూ లాభాదాయకమైన ఆదాయాన్ని ఆర్జించే దిశగా రైతు హరిబాబు అడుగులు వేస్తున్నాడు ఆ వివరాలు మీకోసం.

అనంతపురం జిల్లా ఓ.డి.చెరువు మండలం డబురువారిపల్లెకి చెందిన రైతు హరిబాబు. తనకున్న ఎకరం పొలంలో తైవాన్ జామ సాగు చేస్తున్నాడు. గతంలో తాను సాగుచేసిన వేరుశనగ, మిర్చి పంటల్లో తీవ్ర నష్టాలను చూడడమే కాకుండా ఆర్ధికంగా ఎంన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సాగులో పెట్టిన పెట్టుబడులు కూడా దక్కకపోవడంతో అప్పులపాలయ్యాడు. అయినా నిరాశ పడలేదు వ్యవసాయంలో ఎలాగైనా కష్టనష్టాలకు ఎదురునిలిచి లాభాలను సాధించాలని నిర్ణయించుకున్నాడు. ప్రత్నామ్యాయ సాగు పద్ధతులు, పంటల గురించి తెలుసుకున్నాడు. సిరులు కురిపించే తైవాన్ జామ గురించి తెలుసుకున్నాడు. జామ సాగు మొదలు పెట్టాడు.

జామ సాగు చేసే రైతులు గతంలో తెల్ల కండ రకాలను, ఎర్ర కండ రకాలను పండించేవారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఎక్కువ దిగుబడిని ఇస్తున్న తైవాన్ జామ వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. తైవాన్ జామ కాయ ఒక్కటి సుమారు 850 నుంచి 900 గ్రాముల వరకు పెరుగుతుంది. దీంతో పాటు మన దేశ వాతావరణాన్ని తట్టుకొని అన్ని సీజన్‌లలో పూత పూసి కాయ కాస్తుంది.

సాధారణంగా జామ సాగుకు ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపరు. పెద్దగా లాభాలు రావని పంట కోసం ఏడాదంతా నిరీక్షించాల్సి వస్తుందని ముందుకు రారు. కానీ తైవాన్ జామ పరిమాణంలో పెద్దదిగా ఉండటంతో పాటు రుచి కూడా అమోఘంగా ఉండటంతో మార్కెట్‌లోనూ మంచి గిరాకీ ఉంది. అందుకే తన పొలంలో తొలిసారిగా ప్రయోగాత్మకంగా హరిబాబు తైవాన్‌ జామ సాగు చేపట్టాడు.

అసలే కరవు ప్రాంతం అందులోనూ సాగు నీటి సమస్య అయినా హరిబాబు తనకున్న బోరు ద్వారా పంటకు నీటిని అందిస్తున్ానడు. డ్రిప్ పద్ధతిలో నీటిని మొక్కకు మొక్కకు అందజేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆరోగ్యస్పృహ వినియోగదారుల్లో పెరగడంతో సేంద్రియ ఎరువులతోనే పంటలను సాగు చేస్తున్నాడు. ప్రకృతి ఎరువులతో పాటు వేస్ట్ డీకంపోజర్‌ను పంటకువినియోగిస్తున్నాడు. ఆరోగ్యకరమైన, నాణ్యమైన ఉత్పత్తిని సాధిస్తున్నాడు.

ఎకరా జామ సాగుకు సుమారు లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టాడు ఈ రైతు. ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ ధరలను పోల్చుకుంటే కిలో 60 రూపాయల చొప్పున అమ్ముడుపోయినా మొదటి దశ కోతలోనే తన పెట్టుబడి మొత్తం రావచ్చని రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

ఒక్కసారి జాప పంట సాగు చేస్తే దాదాపు 10 సంవత్సరాల వరకు పంట దిగుబడి వస్తూనే ఉంటుంది. దీంతో ఈ రైతు ఆనందానికి అవధులు లేవు. ప్రకృతి విధానాలను అనుసరిస్తు, పెట్టుబడి ఖర్చులను తగ్గించుకుంటూ, సాగులో రాణిస్తున్నాడు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు హరిబాబు.


Show Full Article
Print Article
Next Story
More Stories