రైతులకి అలర్ట్‌.. పీఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందో చూసుకున్నారా..!

Alert for Farmers Have you Made Sure Your Name is on the PM Kisan List
x

రైతులకి అలర్ట్‌.. పీఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందో చూసుకున్నారా..!

Highlights

PM Kisan List: మీరు పీఎం కిసాన్ 11వ విడత కోసం ఎదురు చూస్తున్నట్లయితే ప్రభుత్వం లబ్దిదారుల జాబితా విడుదల చేసింది.

PM Kisan List: మీరు పీఎం కిసాన్ 11వ విడత కోసం ఎదురు చూస్తున్నట్లయితే ప్రభుత్వం లబ్దిదారుల జాబితా విడుదల చేసింది. అందులో మీ పేరు ఉందో లేదో ఒక్కసారి చెక్ చేసుకుంటే మంచిది. రూ.2000 మీకు వస్తాయో రావో తేలిపోతుంది. ఒకవేళ పేరు లేకుంటే ఏం చేయాలో తెలుస్తుంది. వెంటనే జాబితాని తనిఖీ చేయండి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు రూ. 2000 మూడు విడతలు జారీ చేస్తుంది. ఇప్పటి వరకు 10 వాయిదాల సొమ్మును ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేసింది. 10వ విడత సొమ్మును ప్రభుత్వం జనవరి 1న బదిలీ చేసింది. ఇప్పుడు రైతులు పదకొండో విడత కోసం ఎదురు చూస్తున్నారు.

11వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి?

పీఎం కిసాన్ పథకం కింద ఏప్రిల్ 1 నుంచి జూలై 31 మధ్య రైతులకు మొదటి విడత డబ్బులు అందజేస్తామని ప్రభుత్వ తెలిపింది. అదే సమయంలో రెండో విడత డబ్బు ఆగస్టు 1 , నవంబర్ 30 మధ్య బదిలీ అవుతుంది. మూడో విడత డబ్బు డిసెంబర్ 1, మార్చి 31 మధ్య బదిలీ అవుతుంది. ఈ పథకం ప్రయోజనం 2 హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉన్న రైతులు పొందుతారు. ప్రభుత్వ పెన్షన్‌ ప్రయోజనం పొందని రైతులు మాత్రమే ఈ పథకం ప్రయోజనాన్ని పొందగలరు. దీంతో పాటు వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేరు. దీంతో పాటుగా కుటుంబంలో ఏ ఇతర వ్యక్తి అంటే భార్య లేదా భర్త ఈ పథకం ప్రయోజనాన్ని పొందుతుంటే మీరు ఈ పథకానికి అర్హులు కాదు.

ఈ విధంగా మీ ఇన్‌స్టాల్‌మెంట్ తనిఖీ చేయండి

1. ముందుగా pmkisan.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

2. ఈ వెబ్‌సైట్‌కి కుడి వైపున ఉన్న ఫార్మర్స్ కార్నర్‌పై క్లిక్ చేయాలి.

3. ఇప్పుడు మీరు బెనిఫిషియరీ స్టేటస్‌పై క్లిక్ చేయాలి.

4. మీ స్టేటస్‌ తనిఖీ చేయడానికి ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ వంటి అన్ని వివరాలను అందించాలి.

5. ప్రక్రియ పూర్తయిన తర్వాత జాబితాలో మీ పేరును తనిఖీ చేయవచ్చు.

PM Kisan: రైతులకి అలర్ట్‌.. మీరు కూడా ఈ తప్పు చేశారా అయితే నోటీసులే..!

Show Full Article
Print Article
Next Story
More Stories