Health: సడన్‌గా బీపీ మందులు మానేస్తున్నారా.. ఏమవుతుందో తెలుసా.?

Health
x

Health

Highlights

Health: బీపీ ట్యాబ్లెట్స్‌ను ఉన్నపలంగా మానేయడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

Health: రక్తపోటుతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం కారణంగా తక్కువ వయసు వారు కూడా రక్తపోటు బారిన పడుతున్నారు. అయితే ఒక్కసారి బీపీ వచ్చిందంటే పూర్తి స్థాయిలో తగ్గడం దాదాపు అసాధ్యమని తెలిసిందే. అందుకే బీపీతో బాధపడేవారు క్రమం తప్పకుండా ప్రతీరోజూ మందులు వేసుకుంటారు. ఏది ఏమైనా బీపీ గోలి వేసుకోవాల్సిందే. అయితే ఒకవేళ ఉన్నపలంగా బీపీ మందులు వేసుకోవడం ఆపేస్తే ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

బీపీ ట్యాబ్లెట్స్‌ను ఉన్నపలంగా మానేయడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. వైద్యులు కూడా ఈ విధానాన్ని సూచించరు. క్రమంగా తగ్గించుకుంటూ వెళ్లమని చెబుతుంటారు. ఒకవేళ ఉన్నపలంగా బీపీ ట్యాబ్లెట్స్‌ తీసుకోవడాన్ని ఆపేస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రక్తపోటు వెంటనే వేగంగా పెరిగే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అలాగే ఛాతిలో నొప్పి, గుండె వేగం పెరగడం, కాలిలో వాపు వంటి దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.

ఇక ఉన్నపలంగా ట్యాబ్లెట్స్‌ మానేస్తే కొన్ని సందర్భాల్లో గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. స్ట్రోక్‌, కిడ్నీ వైఫల్యం వంటి ఇతర సమస్యలకు కూడా ఇది కారణమవుతుండొచ్చని అంటున్నారు. వీటితో పాటు తలనొప్పి, వికారం, నీరసంగా ఉండడం వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే సెడన్‌గా ట్యాబ్లెట్స్‌ను మానేయడం అస్సలు మంచిది కాదని అంటున్నారు.

బీపీని క్రమంగా కంట్రోల్‌ చేసుకోవడానికి కొన్ని రకాల చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో వీలైనంత వరకు ఉప్పును తగ్గించాలి. అలాగే పికిల్స్‌, చిప్స్‌ వంటి ఉప్పు కంటెంట్‌ ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవడం మానేయాలి. వీటితో పాటు అధిక బరువును అదుపులో పెట్టుకోవాలి. మంచి జీవన విధానం, యోగా మెడిటేషన్‌ వంటి వాటిని అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories