Kidney: శరీరంలో ఈ లక్షణాలా.? కిడ్నీలు ప్రమాదంలో పడుతున్నట్లే..

Kidney
x

Kidney

Highlights

Kidney: ప్రస్తుతం కిడ్నీ సంబంధిత సమస్యల బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

Kidney: ప్రస్తుతం కిడ్నీ సంబంధిత సమస్యల బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 84 కోట్ల మంది కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు గణంకాలు చెబుతున్నారు. మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా కిడ్నీ సమస్యల బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. బిజీ లైఫ్‌, కనీసం నీళ్లు కూడా సరిగా తాగని కారణంగా ఈ సమస్యలు పెరుగుతున్నాయి.

అయితే కిడ్నీ సమస్యలను త్వరగా గుర్తిస్తే చికిత్స చాలా సులభంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీల్లో ఏవైనా సమస్యలు తలెత్తితే శరీరం మనల్ని ముందుగానే అలర్ట్ చేస్తుంది. ఈ లక్షణాల ఆధారంగా కిడ్నీ వ్యాధులను ముందుగానే గుర్తించవచ్చు. మరి కిడ్నీల ఆరోగ్యం దెబ్బతింటే కనిపించే ఆ ముందస్తు లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీ సమస్యలు రావడానికి అలవాట్లు, వంశపారంపర్య సమస్యలు, ఎక్కువగా మెడిసిన్స్‌ తీసుకోవడం కూడా కారణమని నిపుణులు అంటున్నారు. శరీరంలోని వ్యర్ధాల తొలగింపు సరిగ్గా లేకపోవడంతో కొన్ని రకాల కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశం ఏర్పడుతుంది.

కిడ్నీ సంబంధిత సమస్యలు వచ్చే ముందు పాదాలు, చీలమండంలో పాటు, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. అదే విదంగా తక్కువగా శ్వాస తీసుకోవడం, నిద్రలేమి వంటి సమస్యలు కూడా కిడ్నీ ఫెల్యుయర్‌కి ప్రాథమిక లక్షణంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీ మూత్ర విసర్జనలో ఇబ్బందులు ఏర్పడుతున్నా, మూత్ర విసర్జన చేస్తుంటే విపరీతమైన నొప్పి కలిగినా కిడ్నీ సంబంధిత సమస్యలు ప్రారంభమవుతున్నాయని అర్థం చేసుకోవాలి. ఇక కిడ్నీల్లో సమస్యలు తలెత్తితే ఆకలి లేకపోవడం, వాంతులు, బాగా నీరసంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

ఇక కిడ్నీ వ్యాధులువస్తే ఆకలి లేకపోవడం, వాంతులు, బాగా నీరసంగా ఉండటం, శరీరం ఉబ్బడం, ఉబ్బసం, వెన్నునొప్పి, మూత్రంలో రక్తం, వెన్నునొప్పి, తల తిరగడం, మెడనొప్పి, వికారం, వాంతులు వాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. పైన తెలిపిన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రందించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు అంటున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories