Sugarcane juice: చెరుకు రసం ఎక్కడ కనిపించినా వెంటనే తాగేయండి.. ఎందుకంటే

Sugarcane juice
x

Sugarcane juice

Highlights

Sugarcane juice: చెరకు రసం పోషకాలు, ఖనిజాలకు పెట్టింది పేరు.

Sugarcane juice: కాలంతో సంబంధం లేకుండా చెరుకు రసం లభిస్తుంది. రోడ్డు పక్కన కనిపించే చెరుకు రసంతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. రుచిలో అమృతాన్ని తలపించే చెరుకు రసంతో లాభాలు కూడా ఓ రేంజ్‌లో ఉంటాయి. ప్రతీ 100 గ్రాముల చెరుకు రసంలో 269 కేలరీలు ఉంటాయి. చెరుకు రసంను తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

చెరకు రసం పోషకాలు, ఖనిజాలకు పెట్టింది పేరు. చెరుకు రసంలో క్యాల్షియం మొదలు మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని క్యాన్సర్ కణాలు పెరగకుండా చేస్తాయి. అలాగే చెరుకు రసంను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్‌ సమస్య తగ్గిపోతుంది. చెరుకు రసంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది బరువును కంట్రోల్‌ చేయడంలో ఉపయోగపడుతుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు.

చెరుకు రసంలో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది దంతాల ఎనామిల్, దంతాలు దృఢంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎముకల ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. అంతేకాకుండా ఇందులోని కేలరీలు ఇన్‌స్టాంట్ శక్తిని అందిస్తాయి. కడుపు సంబంధిత సమస్యలతో బాధపడేవారికి కూడా చెరుకు రసం కీలకంగా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. చెరుకులోని గుణాలు జీర్ణ రసాల స్రావాన్ని పెంచడంలో సహాయపడుతాయి.

యూరిన్‌ ఇన్ఫెక్షన్‌ను దూరం చేయడంలో కూడా చెరుకు రసం ఉపయోగపడుతుంది. అలాగే మహిళల్లో నెలసరి సమయాల్లో వచ్చే సమస్యలను దూరం చేయడంలో కూడా చెరుకు రసం ఉపయోగపడుతుంది. ఇక చెరుకు రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కామెర్లు, కాలేయ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories