Black pepper: మిరియాలతో ఇలా చేస్తే.. చలికాలం వచ్చే వ్యాధులు బలాదూర్‌ అవ్వాల్సిందే..

Black pepper
x

Black pepper

Highlights

Black pepper: వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఓవైపు వర్షాలు, మరోవైపు ఉష్ణోగ్రతలు తగ్గడం వెరసి రకరకాల సీజనల్‌ వ్యాధులు దండెత్తుతున్నాయి.

Black pepper: వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఓవైపు వర్షాలు, మరోవైపు ఉష్ణోగ్రతలు తగ్గడం వెరసి రకరకాల సీజనల్‌ వ్యాధులు దండెత్తుతున్నాయి. ముఖ్యంగా చలికాలంలో కనిపించే ప్రధాన వ్యాధుల్లో జలుబు, దగ్గు, జ్వరం వంటివి ప్రధానమైవి. అయితే ఈ వ్యాధులు వచ్చిన తర్వాత వైద్యులను సంప్రదించడం కంటే ముందుగా అలర్ట్‌ అయితే. అసలు వ్యాధుల బారిన పడే అవకాశాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధులకు చెక్‌ పెట్టడంలో నల్ల మిరియాలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

నల్ల మిరియాలతో చేసిన టీ లేదా కషాయం తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా నల్ల మిరియాల్లో యాంటీమైక్రోబయల్, యాంటీ అలెర్జిక్, యాంటీ బాక్టీరియల్, యాంటీ గ్యాస్, డైయూరిటిక్, డైజెస్టివ్ వంటి లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి సీజనల్‌ వ్యాధులను దరిచేరకుండా అడ్డుకోవడంలో సహాయపడుతాయి. అలాగే జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడుతాయి.

ఇక చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే మిరియాల కషాయం తాగాలని నిపుణులు చెబుతున్నారు.

దీంతో గొంతు నొప్పి వంటి సమస్యలు దూరమవుతాయి. సాధారణంగా చలికాలం రకరకాల మిండి వంటలను ఎక్కువగా తింటుంటారు. దీంతో బరువు పెరగడానికి కూడా కారణమవుతుంది. అయితే మిరియాల కషాయం తాగడం వల్ల బరువు తగ్గడంలో కూడా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇక కండరాలు, కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఆహారంలో మిరియాలు చేర్చుకోవడం మంచిది. సాధారణంగా చలికాలంలో కీళ్ల నొప్పులు మరింత ఎక్కువవుతాయి. మిరియాల్లో ఉండే.. యాంటీ-అలెర్జిక్, ఆర్థరైటిక్ గుణాలు నొప్పి, మంటను తగ్గిస్తాయి. కీళ్ల సమస్యలను దూరం చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories