Kendriya Vidyalaya Admissions Notification: కేంద్రీయ విద్యాలయంలో దరఖాస్తులకు చివరి తేది ఎప్పుడంటే..

Kendriya Vidyalaya Admissions Notification: కేంద్రీయ విద్యాలయంలో దరఖాస్తులకు చివరి తేది ఎప్పుడంటే..
x
KENDRIYA VIDYALAYAM
Highlights

Kendriya Vidyalaya Admissions Notification: ఉమ్మడి మెదక్ జిల్లాలోని కేంద్రీయ విద్యాలయలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనికుల పిల్లలతో పాటుగా ఇతరుల పిల్లలకు చేరేవిధంగా ప్రవేశాలు కల్పిస్తారు.

Kendriya Vidyalaya Admissions Notification: ఉమ్మడి మెదక్ జిల్లాలోని కేంద్రీయ విద్యాలయలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనికుల పిల్లలతో పాటుగా ఇతరుల పిల్లలకు చేరేవిధంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఉన్న రెండు కేంద్రీయ విద్యాలయాలు ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి. వాటిలో ఎద్దు మైలారం (ఓడిఎఫ్‌)లో ఒకటి ఉండగా ఝరాసంగం మండల కేంద్రంలో మరో విద్యాలయం ఉంది. ఈ విద్యాలయాలను ఆర్మీ ఉద్యోగుల బదిలీలను దృష్టిలో పెట్టుకుని వారి పిల్లల విద్యాబోధనకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో సీబీఎస్‌ఈ సిలబస్‌తో కేంద్రీయ విద్యాలయాలను ముందుగా ఏర్పాటు చేశారు. అయితే ఈ విద్యాలయంలో ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు మాత్రమే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వాటి అనుబంధ సంస్థలలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల పిల్లలకు కూడా ప్రవేశాలను కల్పిస్తున్నారు. ఇందులో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం చొప్పున , తాజా ప్రవేశాలలో మూడు శాతం సీట్లు దివ్యాంగులకు రిజర్వు చేస్తారు. ప్రవేశాలు పొందే విద్యార్థి మార్చి 31 నాటికి 5 నుంచి 7 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. వికలాంగ విద్యార్థుల మాత్రం రెండేళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం..

ఈ విద్యాలయంలో పిల్లలను చేర్పించాలనుకుంటే ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కేంద్రీయ విద్యాలయం సంఘటన్‌ (కేవీఎస్‌) నుంచి 80 మంది విద్యార్థుల ఎంపిక చేస్తారు. ఈ జాబితా నేరుగా విద్యాలయానికి పంపుతారు. ఆ ఎంపిక చేసిన జాబితాను కేవీఎస్‌ అధికారులు సంబందిత వెబ్‌సైట్‌లో అప్ లోడ్ చేస్తారు. జాబితాలో పేరు నమోదయిన వారు మాత్రమే తమ రిజినల్‌ దృవికరణ పత్రాలతో కేవీలో సంప్రదించి ప్రవేశాలను పొందాల్సి ఉంటుంది.

షెడ్యూల్‌ ఇలా..

1వ తరగతిలో ప్రవేశాలకు జూలై 20వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

ఆగస్టు 7వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు నమోదు చేసుకొనే అవకాశం కలదు.

అగస్టు 11వ తేదిన ఎంపికైన విద్యార్థులకు సంబంధించిన ప్రొవిజినల్‌ తొలి జాబితా ప్రకటన చేస్తారు.

ఈ జాబితాలో విద్యార్ధులు చేరకుండా సీట్లు ఏమైనా మిగిలి ఉంటే ఈనెల 24న రెండో జాబితా విడుదల చేస్తారు. అప్పుడు కూడా సీట్లు భర్తీ కాకపోతే మూడో జాబితాను 26న విడుదల చేస్తారు.

దరఖాస్తు చేసుకునే విధానం

http://kvsonlineadmission.kvs.gov.in & http://tlm4all.com ద్వారా లాగిన్‌ కావాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories