నిరుద్యోగులకు శుభవార్త ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-ECIL ఉద్యోగాల నోటిఫికేషన్లను విడుదల చేస్తుంది. ఈ నోటిఫికేషన్ల ద్వారా...
నిరుద్యోగులకు శుభవార్త ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-ECIL ఉద్యోగాల నోటిఫికేషన్లను విడుదల చేస్తుంది. ఈ నోటిఫికేషన్ల ద్వారా ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సుమారుగా 82 పోస్టుల్ని భర్తీ చేయనుంది.
ఇసీఐఎల్ విడుదల చేయనున్న మొదటి నోటిఫికేషన్ ద్వారా 70 టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జూన్ 4న ప్రారంభమైంది. ఈ పోస్టులకోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు ఇంటర్వ్యూ చేసి వారిని నియమించనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు 2020 జూన్ 11 సాయంత్రం 4 గంటల్లోగా http://careers.ecil.co.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
ఇక మిగిలిన 12 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు వేరుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. 2020 జూన్ 22 సాయంత్రం 4 గంటల్లోగా ఆసక్తిగల అభ్యర్థులు ఈ పోస్టుల కోసం http://careers.ecil.co.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హత:
*కంప్యూటర్ సైన్స్‌లో 60% మార్కులతో ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
*ఒక ఏడాది పని చేసిన అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
*ఎంపికైనవారికి వేతనం రూ.23,000 లభిస్తుంది.
ఎంపిక విధానం:
*రాతపరీక్ష
*ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది ఈసీఐఎల్. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ కార్యాలయంలో ఈ ఇంటర్వ్యూలు జరగనున్నాయి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire