AICTE : ఇంజనీరింగ్‌, టెక్నికల్‌ కోర్సుల విద్యార్థులకు ఊరట

AICTE : ఇంజనీరింగ్‌, టెక్నికల్‌ కోర్సుల విద్యార్థులకు ఊరట
x

AICTE logo

Highlights

AICTE : ఇంటర్ విద్యను పూర్తి చేసుకున్న చాలా మంది విద్యార్థులు భవిష్యత్తులో ఇంజనీరింగ్ చదవాలా లేదా ఇతర టెక్నికల్ కోర్సులను చదవాలా అని సతమతమవుతూ ఉంటారు.

AICTE : ఇంటర్ విద్యను పూర్తి చేసుకున్న చాలా మంది విద్యార్థులు భవిష్యత్తులో ఇంజనీరింగ్ చదవాలా లేదా ఇతర టెక్నికల్ కోర్సులను చదవాలా అని సతమతమవుతూ ఉంటారు. కొంత మంది కొన్ని కోర్సులకు ఫీజును కట్టి కూడా దాన్ని చదవడానికి ఇష్ట పడరు. దీంతో వారు కట్టిన ఫీజును కళాశాల యాజమాన్యాలు, యూని వర్సిటీలు తిరిగి ఇవ్వవు. దీంతో విద్యార్ధులు ఆ ఫీజు డబ్బులను వదులుకోవలసిందే. అయితే అలా అడ్మిషన్లు రద్దు చేసుకునే విద్యార్ధులకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) శుభవార్త చెప్పింది.

ఇంజినీరింగ్, ఇతర టెక్నికల్ కోర్సులు చదవాలనుకునే విద్యార్థులు అడ్మషన్‌ పొంది, ఆ తరువాత అనుకోని కారణాలతో అడ్మిషన్ రద్దు చేసుకోవాలనుకుంటే వారు అడ్మిషన్ రద్దు చేసుకోవచ్చని, ఆ విద్యార్ధులు చెల్లించిన అడ్మిషన్ ఫీజులు, సర్టిఫికెట్లను వారంలోగా తిరిగి వెనక్కి ఇచ్చేయాలని ఏఐసీటీఈ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన నిబంధనలపై AICTE కసరత్తును పూర్తి చేసింది. అంతే కాదు దానికి సంబంధించిన ఉత్తర్వులను కూడా ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ తాజాగా జారీచేసింది.

అడ్మిషన్‌ తీసుకుని తరగతులు ప్రారంభించక ముందే రద్దు చేసుకునే విద్యార్థులతో పాటు కోర్సు మధ్యలో అడ్మిషన్ ను ఉపసంహరించుకునే విద్యార్థులకు కూడా ఈ సౌకర్యాన్ని కల్పిస్తుంది. వారు చెల్లించిన ఫీజులు, ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. ఈ విషయంలో విద్యా సంస్థలు ఏం చెయ్యాలో ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలోనే AICTE ఈ నిర్ణయం తీసుకుందని, కరోనా కష్ట కాలంలో విద్యాసంస్థలు బాధ్యతగా తీసుకోవాలిని పేర్కొంది.

AICTE తాజా ఆదేశాలు...

విద్యార్ధులు అడ్మిషన్‌ ను నవంబర్‌ 10లోపు రద్దు చేసుకుంటే చెల్లించిన ఫీజులో రూ.1,000 లోపు ప్రాసెసింగ్‌ ఛార్జీలు మినహాయించి మిగిలిన నగదును విద్యార్ధికి తిరిగి ఇవ్వాలి.

విద్యార్ధులు అడ్మిషన్‌ ను నవంబర్‌ 10 తరువాత వద్దనుకుంటే, యాజమాన్యం ఆ సీటును నవంబర్‌ 15లోగా వేరే విద్యార్థితో భర్తీ చేసినట్లయితే ఫీజు నుంచి రూ.1,000లోపు ప్రాసెసింగ్‌ ఛార్జీలు మినహాయించి విద్యార్థి ఉన్నన్ని రోజులకు ట్యూషన్‌ ఫీజును అలాగే కళాశాలకు సబంధించిన హాస్టల్‌ లో ఉన్నట్లయితే ఆ ఫీజును కూడా మినహాయించి మిగిలిన సొమ్మును తిరిగి ఇవ్వాలి.

నవంబర్‌ 10 తర్వాత ఖాళీ అయిన సీటు నవంబర్‌ 15 వరకు అడ్మిషన్‌ అవ్వని పక్షంలో అడ్మిషన్ రద్దు చేసుకన్న విద్యార్థికి సెక్యూరిటీ డిపాజిట్‌, సర్టిఫికెట్లు వెనక్కి వస్తాయి.

విద్యార్థి అడ్మిషన్‌ మానుకొని వెళ్లిపోవాలనుకుంటే నెక్ట్స్ సెమిస్టర్లు, సంవత్సరాల ఫీజుల్ని విద్యా సంస్థలు వసూలు చేయకూడదు.

Show Full Article
Print Article
Next Story
More Stories