పది, ఐటీఐ విద్యార్థులకి శుభవార్త.. యంత్ర ఇండియాలో 5,395 ఉద్యోగాలు.. నో ఎగ్జాం నో ఇంటర్వ్యూ..!

Yantra India Limited Recruitment 2023 5395 ITI Non ITI Trade Apprentice Posts Check for all Details
x

పది, ఐటీఐ విద్యార్థులకి శుభవార్త.. యంత్ర ఇండియాలో 5,395 ఉద్యోగాలు.. నో ఎగ్జాం నో ఇంటర్వ్యూ..!

Highlights

Yantra India Apprentice Jobs 2023: భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండే నాగ్‌పుర్‌లోని యంత్ర ఇండియా లిమిటెడ్ ట్రేడ్‌ అప్రెంటిస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Yantra India Apprentice Jobs 2023: భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండే నాగ్‌పుర్‌లోని యంత్ర ఇండియా లిమిటెడ్ ట్రేడ్‌ అప్రెంటిస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న పలు రాష్ట్రాల్లోని ఫ్యాక్టరీల్లో పనిచేయడానికి 5,395 ఐటీఐ, నాన్‌ ఐటీఐ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దేశంలోని ఆర్డ్‌నెన్స్ కేబుల్ ఫ్యాక్టరీ- చండీగఢ్, గన్ క్యారేజ్ ఫ్యాక్టరీ- జబల్‌పూర్, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- ఇటార్సీ, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- ఖమారియా, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- కట్ని, వెహికల్ ఫ్యాక్టరీ- జబల్‌పూర్, హై ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీ- కిర్కీ, మెషిన్ టూల్ ప్రొటోటైప్‌ ఫ్యాక్టరీ- అంబర్‌నాథ్, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- అంబఝరి, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్- మెదక్ తదితర ప్రాంతాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తారు.

తెలంగాణలోని మెదక్‌ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 438 అప్రెంటిస్‌ ఖాళీలు ఉన్నాయి. వీటిలో ఐటీఐకు సంబంధించి 3,508, నాన్ ఐటీఐకు సంబంధించి 1887 ఖాళీలు ఉన్నాయి. పదో తరగతితోపాటు, మెషినిస్ట్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, మేసన్, ఎలక్ట్రోప్లేటర్, మెకానిక్, ఫౌండ్రీమ్యాన్, బాయిలర్ అటెండెంట్, అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ తదితర ట్రేడుల్లో ఐటీఐలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

నాన్-ఐటీఐ కేటగిరీకికి పోస్టులకు పదో తరగతి పాసై ఉండాలి. అభ్యర్ధుల వయసు మార్చి 28, 2023వ తేదీ నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలవారు మార్చి 28లోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో రూ.200, ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులు/మహిళలు/ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు రూ.100లు అప్లికేషన్‌ ఫీజు ఉంటుంది.

విద్యార్హతలో సాధించిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉండదు. ఎంపికైన వారికి నెలకు నాన్-ఐటీఐలకు రూ.6000, ఐటీఐలకు రూ.7000ల చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు. అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకుంటే మంచిది. అప్రెంటిస్‌ పూర్తయిన తర్వాత సర్టిఫికెట్‌ జారీ చేస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories