Astrophysics Career: ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకి సూపర్‌ కెరీర్.. నెలకు 4 నుంచి 5 లక్షల వరకు జీతం..!

What Kind Of Jobs Are There If You Study Astrophysics After Inter How Much Salary Will You Get
x

Astrophysics Career: ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకి సూపర్‌ కెరీర్.. నెలకు 4 నుంచి 5 లక్షల వరకు జీతం..!

Highlights

Astrophysics Career: ఇంటర్‌ తర్వాత ఏ కోర్సు చదవాలో చాలా మందికి తెలియదు. కానీ ఇక్కడ మంచి కోర్సు ఎంచుకుంటే జీవితంలో తొందరగా సెటిల్‌ అవ్వొచ్చు.

Astrophysics Career: ఇంటర్‌ తర్వాత ఏ కోర్సు చదవాలో చాలా మందికి తెలియదు. కానీ ఇక్కడ మంచి కోర్సు ఎంచుకుంటే జీవితంలో తొందరగా సెటిల్‌ అవ్వొచ్చు. లేదంటే భవిష్యత్‌లో ఉద్యోగం విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే అభిరుచి, ఆసక్తిని బట్టి కెరీర్‌ ఎంచుకోవాలి. కొంతమంది విద్యార్థులు మిగతావారితో పోలిస్తే భిన్నంగా ఉంటారు. అలాంటి వారు భిన్నమైన కోర్సులనే ఎంచుకుంటారు. అలాంటి కోర్సులలో ఆస్ట్రోఫిజిక్స్ ఒకటి. ఇందులో కెరీర్‌ చేయడం వల్ల ఎలాంటి అవకాశాలు లభిస్తాయో ఈ రోజు తెలుసుకుందాం.

అంతరిక్షం గురించి తెలుసుకోవాలనే తపన, పరిశోధన చేయాలనే ఆసక్తి ఉన్నవారు ఆస్ట్రోఫిజిక్స్‌ చదువుతారు. నక్షత్రాలు ఎలా ఏర్పడతాయి ఎలా చనిపోతాయి, గ్రహాల వయస్సు ఎంత, వాటి వెనుక ఉన్న సైన్స్ ఏంటి తదితర విషయాలు ఆస్ట్రోఫిజిక్స్ కిందకి వస్తాయి. ఇతర రంగాలతో పోలిస్తే ఈ రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. భవిష్యత్తులో మంచి ఉద్యోగాలకి అవకాశాలు ఉన్నాయి. ఆస్ట్రోఫిజిక్స్‌లో మీరు సర్టిఫికేట్, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయవచ్చు. ఉన్నత చదువుల కోసం బేసిక్‌ స్థాయిలో ఒకే సబ్జెక్టును అధ్యయనం చేయడం అవసరం. ఇక ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌తో 12వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు ఈ కోర్సులలో ప్రవేశం పొందవచ్చు.

సెయింట్ జేవియర్స్ కాలేజ్ ముంబై, సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ న్యూ ఢిల్లీ, లయోలా కాలేజ్ చెన్నై వంటి యూనివర్సిటీలలో అడ్మిషన్ తీసుకోవచ్చు. ఈ కోర్సుల్లో ప్రవేశం మెరిట్, ప్రవేశ ప్రాతిపదికన ఉంటుంది. ఈ కోర్సులు చేసిన తర్వాత మంచి జీతంతో కూడిన ఉద్యోగం లభిస్తుంది. ప్రారంభంలో నెలకు రూ.45 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు లభిస్తుంది. తర్వాత నెలకు రూ.4 నుంచి 5 లక్షల వరకు సంపాదిస్తారు. అంతేకాకుండా ఈ కోర్సు చేసిన తర్వాత ఆస్ట్రోఫిజిసిస్ట్, సైన్స్ టీచర్, లెక్చరర్, అబ్జర్వేషనల్ ఆస్ట్రానమర్, టెక్నీషియన్, స్పేస్ సైంటిస్ట్ వంటి అనేక పోస్టుల్లో పని చేయవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories