ఐటీఐ విద్యార్థులకి సువర్ణవకాశం.. విద్యుత్ శాఖలో ఉద్యోగాలు.. ప్రారంభ జీతమే రూ.39000..!
TSSPDCL Recruitment 2023: తెలంగాణలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి.
TSSPDCL Recruitment 2023: తెలంగాణలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. నిరుద్యోగులకి ఇది పండుగ వాతావరణమనే చెప్పాలి. ఇందులో భాగంగా టీఎస్ఎస్పీడీసీఎల్ నుంచి జూనియర్ లైన్మెన్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి ఉత్తీర్ణులై, ఐటీఐ చదివి ఉన్నవారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ లిమిటెడ్ సదరన్ డిస్ట్రిబ్యూషన్ ఎలక్ట్రిక్ కంపెనీ (TSSPDCL) ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ కింద 1553 జూనియర్ లైన్మెన్ పోస్టులని భర్తీ చేయనుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం జూనియర్ లైన్మెన్ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తు మార్చి 8 నుంచి ప్రారంభమవుతాయి. అభ్యర్థులు మార్చి 28 వరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం ఆన్లైన్లో ఫారమ్ నింపాల్సి ఉంటుంది. అభ్యర్థులు TSSPDCL వెబ్సైట్ tssouthernpower.cgg.gov.inని సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత ప్రమాణాలు
10వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు లైన్మెన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వారు ఎలక్ట్రికల్ ట్రేడ్/వైర్మ్యాన్లో అర్హత కలిగి ఉండాలి. ఇది కాకుండా ఎలక్ట్రికల్ ట్రేడ్లో రెండేళ్ల ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు ఉన్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి
18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు మాత్రమే జూనియర్ లైన్మెన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూనియర్ లైన్మెన్ పోస్టుకు నియమితులయ్యే అభ్యర్థులకు ప్రాథమిక వేతనంగా రూ.39,000 లభిస్తుంది. ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు రూ. 200 చెల్లించాలి. దీంతోపాటు పరీక్ష ఫీజుగా రూ.120 కూడా చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం రూ.320 చెల్లించాల్సి ఉంటుంది. SC/ST/BC కమ్యూనిటీకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire