Group 2 Hall Ticket: టీజీపీఎస్సీ గ్రూప్‌ 2 హాల్‌టికెట్లు విడుదల.. డౌన్ లోడ్ చేసుకోండి ఇలా..

TGPSC Group 2 Hall Ticket Released
x

Group 2 Hall Ticket: టీజీపీఎస్సీ గ్రూప్‌ 2 హాల్‌టికెట్లు విడుదల.. డౌన్ లోడ్ చేసుకోండి ఇలా..

Highlights

TSPSC Group 2 Hall Ticket: గ్రూపు2 పరీక్షల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 15, 16 తేదీల్లో గ్రూపు-2 పరీక్షలను నిర్వహించనున్నారు.

TSPSC Group 2 Hall Ticket: గ్రూపు2 పరీక్షల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 15, 16 తేదీల్లో గ్రూపు-2 పరీక్షలను నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1368 కేంద్రాలు ఏర్పాటు చేశారు. గ్రూపు2 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్.. https://websitenew.tspsc.gov.in/ నుంచి హాట్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచించింది. హాల్ టికెట్ల డౌన్ లోడ్ సమయంలో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే 040-23542185 లేదా 040-23542187 నంబర్లను సంప్రదించాలని తెలిపింది. లేదంటే [email protected] ఈ మెయిల్ సందేహాలు పంపవచ్చని పేర్కొంది.

మొత్తం 4 పేపర్లకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు వరకు పేపర్ 1, 3 పరీక్షలు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2,4 పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి అరగంట ముందే గేట్లు మూసివేస్తామని.. ముగింపు సమయంలోగా అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని టీజీపీఎస్సీ అధికారులు సూచించారు. ఉదయం నిర్వహించే పరీక్షకు 9.30 గంటలు, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2.30 గంటల తర్వాత అభ్యర్థులెవరినీ పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. 783 గ్రూప్-2 పోస్టులకు 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories