TS DSC: టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్త.. త్వరలో మెగా డీఎస్సీ ..!

Telangana Mega DSC Notification Soon
x

TS DSC: టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్త.. త్వరలో మెగా డీఎస్సీ ..!

Highlights

TS DSC: 12 వేల పోస్టులు భర్తీ చేయనున్న ప్రభుత్వం

TS DSC: ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి శుభవార్త రానున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు దాదాపు 12 వేల టీచర్‌ పోస్టులను గుర్తించినట్లు సమాచారం. ఇప్పటికే భర్తీ చేయాలని నిర్ణయించిన 5 వేల 89 పోస్టులతో కలిపి అనుబంధ నోటిఫికేషన్‌ను జారీ చేసే అవకాశం ఉంది. మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు గవర్నర్‌ తమిళిసై అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం అధికారులు కసరత్తు ప్రారంభించారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా 2017లో 13 వేల 500 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఆ తర్వాత మళ్లీ రెండు నెలల క్రితం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 6 వేల 612 టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ పోస్టుల్లో పాఠశాల విద్యలో 5 వేల 089, ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులు మరో 15వందల 23 ఉన్నట్లు ప్రకటించారు. వీటిని డిస్ట్రిక్ట్‌ సెలెక్షన్‌ కమిటీ ద్వారా నిర్వహించాలని నిర్ణయించారు. కలెక్టర్లు నోటిఫికేషన్‌ కూడా జారీచేశారు. 5వేల89 పోస్టుల భర్తీకినోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం లక్షా 77వేల 502 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పోస్టులకు నవంబరు 20 నుంచి 30 వరకు పరీక్షలను నిర్వహించాల్సి ఉండగా.. అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పరీక్షలను వాయిదా వేశారు.

తాజాగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడడంతో అదనపు పోస్టులను జత చేసి మెగా డీఎస్సీని నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే నోటిఫికేషన్‌లో పేర్కొన్న 5వేల 89 పోస్టులకు అదనంగా మరో 4వేల 281 ఖాళీలను గుర్తించారు. వీటితో పాటు గతంలో ప్రకటించిన 15వందల 23 స్పెషల్‌ పోస్టులను కూడా భర్తీ చేయాల్సి ఉంది. వీటితో పాటు మోడల్‌ స్కూళ్లలో మరో వేయి పోస్టులు ఖాళీగాఉన్నట్టు గుర్తించారు. పదోన్నతుల కారణంగా మరో నాలుగు వందల పోస్టులు ఖాళీ అయ్యాయి. ఇలా మొత్తం 12 వేల పోస్టులకు పైగా భర్తీ చేయాల్సి ఉంది. ఇందుకోసం అనుబంధ నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉంది.

తద్వారా గతంలో దరఖాస్తు చేసిన వారూ అర్హులవుతారని, కొత్త వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా లేదు. అయినప్పటికీ ఉపాధ్యాయుల పోస్టులను ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. హేతుబద్ధీకరణ ద్వారా ఇలాంటి పాఠశాలల్లోని పోస్టులను రద్దు చేయాలనే ప్రతిపాదన గతంలో ఉండేది. తాజాగా దాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది.

టీచర్‌ పోస్టులకు సంబంధించిన సిలబ్‌సను మారుస్తారా? లేక పాతదే కొనసాగిస్తారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. రెండు నెలల క్రితం జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఇప్పటికే సిలబ్‌సను ప్రకటించారు. ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు విడివిడిగా సిలబ్‌స్ ను రూపొందించారు. మొత్తం 80 మార్కులకు ఈ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు. 160 ప్రశ్నలతో పేపర్‌ను తయారు చేయనున్నారు. ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున 80 మార్కులను కేటాయించారు. అలాగే టెట్‌కు 20 మార్కుల వెయిటేజీని ఇస్తారు. అయితే.. గత సిలబస్‌ కొనసాగుతుందా? లేక మార్పులు చేస్తారా? అనే విషయంలో స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories