నీట్ పీజీ - 2022 పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరణ

Supreme Court Decision on NEET PG Exams | Telugu News
x

నీట్ పీజీ - 2022 పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరణ

Highlights

NEET PG Exam 2022: వాయిదాతో గందరగోళం, అనిశ్చితి ఏర్పడుతుందన్న సుప్రీంకోర్టు

NEET PG Exam 2022: నీట్ పీజీ పరీక్షల వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నీట్ పీజీ 2021 కౌన్సిలింగ్ ఉన్నందున పరీక్షలు వాయిదా వేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్‌పై జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. నీట్ PG- 2021 కౌన్సిలింగ్ ఉన్నందున పరీక్షలు వాయిదా వేయాలని పిటిషనర్లు సుప్రీంకోర్టును కోరారు.

అయితే పరీక్షకు సిద్ధమైన 2 లక్షల మంది అభ్యర్థులతో పాటు రోగులకు చికిత్సపై కూడా ప్రభావం పడుతుందని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో షెడ్యూల్ ప్రకారమే మే 21న నీట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories