పదో తరగతితో కొలువు కొట్టండి.. కేంద్ర ప్రభుత్వ శాఖలలో అడుగుపెట్టండి..!

SSC MTS Notification 2023 1558 Havaldar Vacancy Check for all Details
x

పదో తరగతితో కొలువు కొట్టండి.. కేంద్ర ప్రభుత్వ శాఖలలో అడుగుపెట్టండి..!

Highlights

SSC MTS Notification 2023: పదో తరగతి చదివిన నిరుద్యోగులకి ఇది సువర్ణవకాశమని చెప్పాలి.

SSC MTS Notification 2023: పదో తరగతి చదివిన నిరుద్యోగులకి ఇది సువర్ణవకాశమని చెప్పాలి. ఎందుకంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) మల్టీ-టాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్, హవల్దార్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద మొత్తం 1558 పోస్టులను భర్తీ చేస్తుంది. వీటిలో 1558 MTS, 360 హవల్దార్ (CBIC, CBN) పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ నెలలో పరీక్ష నిర్వహించనుంది.

అర్హత కలిగిన అభ్యర్థులు తప్పనిసరిగా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. లేదా గుర్తింపు పొందిన బోర్డు నుంచి దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పోస్టులకు అభ్యర్థి వయస్సు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయోపరిమితి 25 సంవత్సరాలుగా నిర్ణయించారు. దరఖాస్తు రుసుము 100 రూపాయలు చెల్లించాలి. అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. https://ssc.nic.in అధికారిక వెబ్‌సైట్‌లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ ప్రాసెస్ అందుబాటులో ఉంది.

ముఖ్యమైన తేదీలు

1. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించాల్సిన తేదీలు: 30-06-2023 నుంచి 21-07-2023 వరకు

2. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూలై 21, 2023

3. ఆన్‌లైన్ ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: జూలై 22, 2023 (23:00)

4. ఆఫ్‌లైన్ చలాన్ రూపొందించడానికి చివరి తేదీ : జూలై 23, 2023

5. దిద్దుబాటు రుసుము & ఆన్‌లైన్ చెల్లింపు: 26-07-2023 నుంచి 28-07-2023 వరకు

6. కంప్యూటర్ ఆధారిత పరీక్ష షెడ్యూల్: సెప్టెంబర్ 2023

Show Full Article
Print Article
Next Story
More Stories