నిరుద్యోగులకి శుభవార్త.. ఇంటర్‌ అర్హతతో 4500 ఉద్యోగాలు..!

SSC CHSL Recruitment Notification 2022 4500 Vacancy Check for all Details
x

నిరుద్యోగులకి శుభవార్త.. ఇంటర్‌ అర్హతతో 4500 ఉద్యోగాలు..!

Highlights

SSC CHSL 2022 Vacancy Details: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఇటీవల కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL)పరీక్ష 2022-2023 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించింది.

SSC CHSL 2022 Vacancy Details: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఇటీవల కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL)పరీక్ష 2022-2023 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించింది. 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. ఇందులో 4500 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు 04 జనవరి 2023 లోప అప్లై చేసుకోవాలి. పరీక్ష ఆన్‌లైన్ విధానంలో మార్చి 2023లో జరుగుతుంది.

టైర్ 1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులందరికీ కమిషన్ టైర్ 2 పరీక్షను నిర్వహిస్తుంది. లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO), డేటా ఎంట్రీ ఆపరేటర్, గ్రేడ్ 'A' పోస్టులు ఇందులో ఉన్నాయి. అభ్యర్థులు నోటిఫికేషన్‌లో ఉన్న సమాచారాన్ని పూర్తిగా చదవాలి.

జీవ భత్యాలు

1. లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA):పే లెవల్-2 రూ. 19,900-63,200

2. డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO): లెవల్-4 (రూ. 25,500-81,100), లెవెల్-5 రూ. 29,200-92,300.

3. డేటా ఎంట్రీ ఆపరేటర్, గ్రేడ్ 'A': పే లెవల్-4 రూ. 25,500-81,100.

అర్హత ప్రమాణాలు

LDC/JSA, DEO/DEO గ్రేడ్ 'A'అభ్యర్థి తప్పనిసరిగా 12వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుంచి దానికి సమానమైన సర్టిఫికెట్‌ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయోపరిమితి 27 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఎంపిక ప్రక్రియ గురించి మాట్లాడితే ముందుగా SSC CHSL టైర్ 1 పరీక్ష ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారిని SSC CHSL టైర్ 2 పరీక్షకు పిలుస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు రూ. 100 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories