SSC CGL 2023 Notification: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌లో 7500 ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం..!

SSC CGL 2023 Registration Begins Over 7,500 Posts
x

SSC CGL 2023 Notification: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌లో 7500 ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం..!

Highlights

SSC CGL 2023 Notification: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

SSC CGL 2023 Notification: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inని సందర్శించి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాల్లోని దాదాపు 7500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్ అఫీసర్ తో పాటు మొత్తం 36 కేటగిరీల్లోని ఖాళీలు ఇందులో ఉన్నాయి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి మే 4ను ఆఖరి తేదీగా నిర్ణయించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, PwBD, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళలకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు. రెండు దశల్లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఉంటుంది. టైర్‌ 1 పరీక్ష ఆబ్జెక్టివ్‌ టైప్‌లో ఉంటుంది. టైర్‌ 2 పరీక్షలో మూడు పేపర్లు ఉంటాయి. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఉంటాయి.

అధికారిక వెబ్ సైట్:https://ssc.nic.in/

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు: ఏప్రిల్‌ 3 నుంచి మే 3 వరకు

ఆన్‌లైన్‌లో ఫీజు లాస్ట్ డేట్ : మే 4 రాత్రి 11గంటల వరకు

దరఖాస్తుల్లో సవరణ: మే 7 నుంచి 8వరకు

టైర్‌ 1 కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష జులైలో ఉంటుంది

టైర్‌ 2 పరీక్షలకు తేదీలను తర్వాత ఖరారు చేస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories