నిరుద్యోగులకి శుభవార్త.. 20,000 వేల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..!

SSC CGL 2022 Notification 20000 Posts Recruitment Check for all Details
x

నిరుద్యోగులకి శుభవార్త.. 20,000 వేల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..!

Highlights

SSC: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) దేశంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలలో ఖాళీగా ఉన్న 20000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

SSC: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) దేశంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలలో ఖాళీగా ఉన్న 20000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అందువల్ల నిరుద్యోగులకి ఇది ఒక సువర్ణ అవకాశమని చెప్పవచ్చు. వెంటనే అప్లై చేయండి. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ కోసం అప్లికేషన్ లింక్ 08 అక్టోబర్ 2022 తర్వాత క్లోజ్‌ అవుతుంది. అయితే 09 అక్టోబర్ 2022 వరకు ఆన్‌లైన్ మోడ్ ద్వారా, 10 అక్టోబర్ 2022 వరకు ఈ-చలాన్ ద్వారా దరఖాస్తు రుసుమును చెల్లించవచ్చు.

ఈ సంవత్సరం కమిషన్ అభ్యర్థులను టైర్ 1, టైర్ 2 ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తుంది. టైర్ 3, టైర్ 4 ఇప్పుడు టైర్ 2లో విలీనం అయ్యాయి. టైర్ 2లో మూడు పేపర్లు ఉంటాయి. SSC CGL టైర్ 2 పేపర్ 1 మూడు కొత్త మాడ్యూళ్లను కలిగి ఉంటుంది. అభ్యర్థులు SSC CGL టైర్ 2 క్రింద కొత్త పరీక్షా విధానం ఉంటుంది. వయోపరిమితి గురించి మాట్లాడితే గ్రూప్ సి అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. అదే గరిష్ట వయోపరిమితిని 27 ఏళ్లుగా ఉంచారు. అయితే గ్రూప్ B కోసం అభ్యర్థి వయస్సు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. అదే గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లుగా తెలిపారు.

ఎలా అప్లై చేయాలి..?

1. అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inని సందర్శించాలి.

2. తర్వాత అప్లై ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేయాలి.

3. మొదట లాగిన్ చేసి ఆపై ఫారమ్ నింపాలి. అవసరమైతే ఫీజు చెల్లించాలి.

4. తర్వాత ఫారమ్‌ను సమర్పించండి. డౌన్‌లోడ్ చేసిన తర్వాత కాపీని ప్రింట్ అవుట్ తీసుకోండి.

SSC CGL 2022 ముఖ్యమైన తేదీలు

1. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 17 సెప్టెంబర్ 2022

2. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 08 అక్టోబర్ 2022

3. దరఖాస్తు రసీదుకు చివరి తేదీ 08 అక్టోబర్ 2022 (23:00)

4. ఆఫ్‌లైన్ దరఖాస్తు రుసుము చలాన్‌ను రూపొందించడానికి చివరి తేదీ 08 అక్టోబర్ 2022 (23:00)

5. ఆన్‌లైన్ దరఖాస్తు రుసుమును సమర్పించడానికి చివరి తేదీ 09 అక్టోబర్ 2022 (23:00)

6. చలాన్ సహాయంతో రుసుము డిపాజిట్ చేయడానికి చివరి తేదీ 10 అక్టోబర్ 2022

7. SSC CGL టైర్-I పరీక్ష తాత్కాలిక తేదీ - డిసెంబర్ 2022

Show Full Article
Print Article
Next Story
More Stories