JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో స్మార్ట్‌ కాపీయింగ్‌.. టాపరే కీలక సూత్రధారి

Smart Copying In JEE Advanced Exams At Hyderabad
x

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో స్మార్ట్‌ కాపీయింగ్‌.. టాపరే కీలక సూత్రధారి

Highlights

JEE Advanced: ఆదివారం జరిగిన స్మార్ట్ కాపీయింగ్‌పై కేసు నమోదు

JEE Advanced: జేఈఈ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్ వెలుగులోకి వచ్చింది. నలుగురు కుర్రాళ్లు.. వాట్సాప్‌ గ్రూప్‌ పెట్టి మరీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో స్మార్ట్‌గా కాపీయింగ్‌ చేయాలనుకున్నారు.. కానీ అడ్డంగా బుక్కయ్యారు. నలుగురు విద్యార్థులు.. కాపీయింగ్‌కు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందుకోసం ఒక వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఆ నలుగురే సభ్యులుగా ఉన్నారు. పరీక్షకు నలుగురూ.. చాకచక్యంగా స్మార్ట్‌ ఫోన్‌లతో పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశించారు.

నలుగురిలోనూ తెలివైన విద్యార్థి... పరీక్షలు రాస్తున్న మిగతా ముగ్గురు విద్యార్థులూ ఆ సమాధానాలను కాపీ చేశారు. ఈ క్రమంలోనే.. ఒక కేంద్రంలో ఇన్విజిలేటర్‌ ఈ బాగోతాన్ని గమనించి ఆ విద్యార్థిని పట్టుకున్నారు. అతణ్ని ప్రశ్నించగా మొత్తం తతంగమంతా బయటపడింది. వెంటనే ఆ పరీక్షా కేంద్రం అధికారులు పోలీసులకు సమాచారం అందించి విద్యార్థిని అప్పగించారు. కాగా.. విద్యార్థిది కడప జిల్లా అని తేలింది.

Show Full Article
Print Article
Next Story
More Stories