Railway Recruitment 2022: పరీక్ష లేకుండానే రైల్వే ఉద్యోగం.. పదో తరగతి, ఐటీఐ పాసైతే చాలు..!

Recruitment for Apprentice Posts in Various Departments Workshops of Western Railway
x

Railway Recruitment 2022: పరీక్ష లేకుండానే రైల్వే ఉద్యోగం.. పదో తరగతి, ఐటీఐ పాసైతే చాలు..!

Highlights

Railway Recruitment 2022: భారతీయ రైల్వేలో ఉద్యోగం సంపాదించాలనే యువతకి ఇది శుభవార్తనే చెప్పాలి.

Railway Recruitment 2022: భారతీయ రైల్వేలో ఉద్యోగం సంపాదించాలనే యువతకి ఇది శుభవార్తనే చెప్పాలి. పశ్చిమ రైల్వే వివిధ విభాగాలు, వర్క్‌షాప్‌లలో అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తులను కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు రైల్వే అధికారిక వెబ్‌సైట్ rrc wr.comని సందర్శించి అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ జూన్ 27. అభ్యర్థులు ఈ పోస్ట్‌లకు నేరుగా ఈ లింక్ https://www.rrc-wr.com/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ కింద మొత్తం 3612 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ - 28 మే

దరఖాస్తుకు చివరి తేదీ - 27 జూన్

మొత్తం పోస్టుల సంఖ్య- 3612

అర్హత ప్రమాణాలు:అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 సంవత్సరాలు.

Show Full Article
Print Article
Next Story
More Stories