Railway Recruitment 2024: ఇండియన్‌ రైల్వేలో అప్రెంటిస్‌ పోస్టులు.. పది పాసైతే చాలు..!

Railway Recruitment 2024 For 3015 Post Check For All Details
x

Railway Recruitment 2024: ఇండియన్‌ రైల్వేలో అప్రెంటిస్‌ పోస్టులు.. పది పాసైతే చాలు..!

Highlights

Railway Recruitment 2024: ఇండియన్ రైల్వేస్, వెస్ట్ సెంట్రల్ (WCR) డివిజన్ అప్రెంటిస్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Railway Recruitment 2024: ఇండియన్ రైల్వేస్, వెస్ట్ సెంట్రల్ (WCR) డివిజన్ అప్రెంటిస్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు WCR wcr.indianrailways.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ లక్ష్యం మొత్తం 3,105 పోస్టులను భర్తీ చేయడం. రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 15 నుంచి ప్రారంభమైంది. జనవరి 14, 2024 వరకు కొనసాగుతుంది.

అభ్యర్థులు తప్పనిసరిగా కనీసం 50% మార్కులతో గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి లేదా దానికి సమానమైన 10+2 పరీక్షా విధానంలో పూర్తి చేసి ఉండాలి. అదనంగా వారు NCVT/SCVT జారీ చేసిన సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అభ్యర్థి వయస్సు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు రుసుము

అభ్యర్థులందరికీ దరఖాస్తు ఫీజు రూ.136 కాగా, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులు రూ.36 చెల్లించాలి. మరింత సమాచారం కోసం అభ్యర్థులు WCR అధికారిక నోటిఫికేషన్‌ను చూడవచ్చు.

ఎంపిక ప్రక్రియ

ఎంపిక ప్రక్రియ మెరిట్ జాబితాపై ఆధారపడి ఉంటుంది. ITI/ట్రేడ్ మార్కులతో పాటు 10వ తరగతి పరీక్షలో పొందిన సగటు మార్కులు లేదా దానికి సమానమైన (10+2 పరీక్షా విధానంలో) మార్కులను మెరిట్ జాబితాలో పరిగణిస్తారు.

ఈ పత్రాలు అవసరం

ఆన్‌లైన్ అప్లికేషన్‌ నింపేముందు అభ్యర్థులు ఈ పత్రాల స్కాన్ చేసిన కాపీలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.

1. ఫోటోగ్రాఫ్, సంతకం JPG ఫార్మాట్‌లో ఉండాలి. దీని ఫైల్ పరిమాణం 50kb కంటే తక్కువ, 200kb కంటే ఎక్కువ ఉండకూడదు.

2. 100 x 120 పిక్సెల్ పరిమాణంతో స్పష్టమైన ముఖంతో అభ్యర్థి ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటో అప్‌లోడ్‌ చేయాలి.

3. 160 x 70 పిక్సెల్ పరిమాణంలో సిగ్నేచర్‌ చేయలి.

4. సర్టిఫికేట్ (JPG ఆకృతిలో ఫైల్ పరిమాణం 50kb-200kb)

5. 10వ తరగతి మార్కు షీట్

6. 10వ తరగతి పాస్ సర్టిఫికెట్

7. SC/ST/OBC/EWS కోసం కమ్యూనిటీ సర్టిఫికేట్ (వర్తిస్తే)

8. PwBD సర్టిఫికేట్ (వర్తిస్తే)

9. NCVT/SCVT జారీ చేసిన ITI సర్టిఫికేట్, మార్క్‌షీట్ అప్‌లోడ్‌ చేయాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories