IAF Pilot Career: సాహస మహిళలకి పైలట్‌ కెరీర్.. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో చేరాలంటే ఇలా చేయండి..!

Pilot Career For Adventurous Women Do This To Join Indian Airforce
x

IAF Pilot Career: సాహస మహిళలకి పైలట్‌ కెరీర్.. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో చేరాలంటే ఇలా చేయండి..!

Highlights

IAF Pilot Career: ఈ రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారు. మగవారితో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు.

IAF Pilot Career: ఈ రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారు. మగవారితో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా రక్షణ రంగంలో వీరి సంఖ్య చాలా పెరిగింది. దేశ ప్రతిష్టని నలుమూలలా చాటుతున్నారు. అయితే ధైర్యం కలిగిన మహిళలు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో చేరి పైలట్‌గా కూడా మారుతున్నారు. ఇందులో కెరీర్‌ చేసి ఉన్నత స్థానాలకి వెళుతున్నారు. మంచి జీతంతో పాటు అన్ని సౌకర్యాలని పొందుతున్నారు. అయితే ఎయిర్‌ ఫోర్స్‌లో ఏ విధంగా చేరాలో ఈ రోజు తెలుసుకుందాం.

ఒక నివేదిక ప్రకారం భారతదేశంలో 15 శాతం మహిళా పైలట్లు ఉన్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రకారం ఇది ప్రపంచ సగటు 5 శాతానికి మూడు రెట్లు ఎక్కువ. మారుతున్న కాలంలో కేవలం ఏడుగురు మహిళలు మాత్రమే వైమానిక దళంలో చేరుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. పైలట్ కావడానికి నాలుగు మార్గాలు ఉన్నాయి. వీటిలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA), కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్ (CDSE), NCC ఎంట్రీ, షార్ట్ సర్వీస్ కమిషన్ ఎంట్రీ (SSC) . అయితే మొదటి మూడు శాశ్వత కమిషన్ నాల్గవది మాత్రం తాత్కాలిక కమిషన్.

ఫైటర్ పైలట్

వైమానిక దళంలో ఫైటర్ పైలట్ కావడానికి రెండు అవకాశాలు ఉన్నాయి. మొదటిది 12వ తరగతి పాసైన తర్వాత రెండవది గ్రాడ్యుయేషన్ తర్వాత. 12వ తరగతి తర్వాత NDA పరీక్షకు హాజరుకావచ్చు. అయితే గ్రాడ్యుయేషన్ తర్వాత ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ AFCAT రాయవచ్చు. UPSC NDA పరీక్షను నిర్వహిస్తుంది. AFCAT పరీక్షను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం సంబంధిత పోర్టల్‌లో ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ పురుష, స్త్రీ అభ్యర్థులు ఇద్దరు రాయవచ్చు. ఈ పరీక్ష ని సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తారు. 14 సంవత్సరాల పాటు షార్ట్ సర్వీస్ కమిషన్‌లో నియామకం కోసం ఈ పరీక్షను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories