Telangana MHSRB Jobs: హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టులకి దరఖాస్తులు ప్రారంభం.. 18 నుంచి 49 ఏళ్ల వారు కూడా అర్హులే..!

Online Applications Have Started For Multi Purpose Health Assistant Jobs In Telangana
x

Telangana MHSRB Jobs: హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టులకి దరఖాస్తులు ప్రారంభం.. 18 నుంచి 49 ఏళ్ల వారు కూడా అర్హులే..!

Highlights

Telangana MHSRB Jobs 2023: తెలంగాణలో నర్సింగ్‌ లేదా మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ కోర్సు చేసిన మహిళలకి ఇది సువర్ణవకాశమని చెప్పాలి.

Telangana MHSRB Jobs 2023: తెలంగాణలో నర్సింగ్‌ లేదా మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ కోర్సు చేసిన మహిళలకి ఇది సువర్ణవకాశమని చెప్పాలి. ఎందుకంటే ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలో 1931 మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ షురూ అయింది. తొలుత ఇచ్చిన 1,666 పొస్టులకు తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో అదనంగా 265 పోస్టులను ఆరోగ్య శాఖ విలీనం చేసిన సంగతి తెలిసిందే.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో అధికారిక వెబ్‌సైట్ సందర్శించి అప్లై చేసుకోవాలి. చివరి తేది సెప్టెంబర్‌ 19, సాయంత్రం 5 గంటలుగా నిర్ణయించారు. అభ్యర్థులు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర నర్సెస్‌ లేదా మిడ్‌వైఫ్‌ కౌన్సిల్‌ గుర్తింపు పొందిన ఏదైనా విద్యా సంస్థలో మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ ట్రైనింగ్‌ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదంటే ఇంటర్‌ ఒకేషనల్‌ మల్టీ పర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ ట్రైనింగ్‌ కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే ఏదైనా ప్రభుత్వ దవఖానాలో ఏడాది పాటు శిక్షణ పొంది ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకి నెలకు రూ.31,040 నుంచి రూ.92,050 వరకు జీతంగా చెల్లిస్తారు.

అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 2023 జులై 1వ తేదీ నాటికి 18 నుంచి 49 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. అలాగే దివ్యాంగులకు పదేళ్ల సడలింపు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌/ఎన్‌సీసీ సర్టిఫికెట్‌ ఉన్న అభ్యర్ధులకు మూడేళ్ల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. అయితే ఈ పోస్టులకు మహిళలు మాత్రమే అర్హులు అవుతారు. అప్లికేషన్ ఫీజు కింద రూ.500తోపాటు అదనంగా ప్రాసెసింగ్‌ ఫీజు కింద రూ.200ల చొప్పున చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్/దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ /నిరుద్యోగ కేటగిరీ అభ్యర్థులకు ప్రాసిసింగ్‌ ఫీజు చెల్లించనవసరం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories