NTPCలో ఉద్యోగాలు.. జీతం 90,000 .. ఎవరు అర్హులంటే..?

NTPC Recruitment 2022 Various Executive Posts in Renewable Energy Sector
x

NTPCలో ఉద్యోగాలు.. జీతం 90,000 .. ఎవరు అర్హులంటే..?

Highlights

NTPC 2022: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) దేశంలోని అత్యుత్తమ పబ్లిక్ కంపెనీలలో ఒకటి.

NTPC 2022: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) దేశంలోని అత్యుత్తమ పబ్లిక్ కంపెనీలలో ఒకటి. ఇందులో పని చేయాలని చాలా మంది యువకులు కలలు కంటారు. వారికి ఇప్పుడు బంపర్‌ ఆఫర్ వచ్చింది. NTPC రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో వివిధ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి గల అభ్యర్థులు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ntpc.co.inని సందర్శించి అప్లై చేసుకోవచ్చు.

ఈ పోస్టులకి దరఖాస్తు ప్రక్రియ 15 జూలై 2022 నుంచి ప్రారంభమైంది. అప్లై చేయడానికి చివరి తేదీ 29 జూలై 2022గా నిర్ణయించారు. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి NTPC విడుదల చేసిన ప్రకటన ప్రకారం మొత్తం 60 పోస్టులకు రిక్రూట్‌మెంట్ ఉంటుంది. ఇందులో రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి 45 పోస్టులు, హెచ్‌ఆర్‌కి 1, కాంట్రాక్ట్ సర్వీసెస్‌కు 4, ఫైనాన్స్‌కు 2, అకౌంట్స్‌కు 4, పీఅండ్‌ఎస్, క్యూఏ 1, IT కోసం, భద్రత కోసం 1 పోస్ట్‌ని భర్తీ చేస్తారు.

ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకునే ముందు అవసరమైన విద్యార్హతలపై దృష్టి సారించాలి. ఎగ్జిక్యూటివ్ పోస్టుకు గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలు. అయితే రిజర్వ్‌డ్ కేటగిరీకి నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. వయస్సుతో పాటు, అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్స్/మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి.

ఇలా దరఖాస్తు చేసుకోండి..

1. ముందుగా NTPC వెబ్‌సైట్ careers.ntpc.co.in ఓపెన్‌ చేయండి.

2. తర్వాత హోమ్ పేజీలో అనేక నోటిఫికేషన్‌లను చూస్తారు. అప్పుడు పునరుత్పాదక శక్తికి సంబంధించిన ప్రకటన నంబర్ 18/22పై క్లిక్ చేయాలి.

3. తర్వాత మీరు వ్యక్తిగత, విద్యా వివరాలను ఎంటర్‌ చేయాల్సిన న్యూ పేజీ ఓపెన్‌ అవుతుంది.

4. ఈ దశను చేసిన తర్వాత చెల్లింపు చేయాలి. మీరు చెల్లింపు కోసం అనేక మోడ్‌ల ఎంపికని చూస్తారు. దాని నుంచి మీరు ఫీజు చెల్లించాలి.

5. తర్వాత ఫారమ్‌ను సమర్పించి ఆపై దరఖాస్తు ఫారమ్‌ను ప్రింటవుట్‌ను తీసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories