NEET 2023 Admit Card: నీట్ అడ్మిట్ కార్డులు విడుదల.. డౌన్ లోడ్ చేసుకోండిలా..

NEET UG Admit Card 2023 has Been Released at neet.nta.nic.in
x

NEET 2023 Admit Card: నీట్ అడ్మిట్ కార్డులు విడుదల.. డౌన్ లోడ్ చేసుకోండిలా..

Highlights

NEET UG Admit Card 2023: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సులో ఎంట్రన్స్ కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్షను మే7న నిర్వహించనున్నారు.

NEET UG Admit Card 2023: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సులో ఎంట్రన్స్ కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్షను మే7న నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల మధ్య పరీక్ష జరగనుంది. ఇప్పటికే సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ ను రిలీజ్ చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA తాజాగా అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. పెన్ను, పేపర్ విధానంతో దేశవ్యాప్తంగా 499 పట్టణాల్లో జరిగే ఈ పరీక్షలకు NTA అన్ని ఏర్పాట్లు చేస్తోంది. హాల్ టికెట్లను వెబ్ సైట్ లో ఉంచింది.

ఇంటిమేషన్ స్లిప్, అడ్మిట్ కార్డ్ కోసం విద్యార్థులు http://neet.nta.nic.in/ వెబ్ సైట్ ను సందర్శించి తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో పాటు అక్కడ పేర్కొన్న సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తెలుగుతో పాటు 13 బాషల్లో జరిగే ఈ పరీక్ష అడ్మిట్ కార్డులను NTA అందుబాటులోకి తీసుకొచ్చింది. గత ఏడాది నీట్ పరీక్షను 17.64 లక్షలమంది విద్యార్థులు రాయగా...ఈ ఏడాది దాదాపు 18 లక్షలమంది రాసే అవకాశం ఉందని అంచనా.

అడ్మిట్ కార్డును ప్రింట్ తీసుకొని దాంతో పాటు NTA అడిగిన డాక్యుమెంట్లు, ఫోటోలను తీసుకొని విద్యార్థులు పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. పరీక్ష రాసేవారు ఎగ్జామినేషన్ సెంటర్ కు కనీసం గంటన్నర ముందు చేరుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అడ్మిట్ కార్డుపై గైడ్ లైన్స్ ఉంటాయి. ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతించేవి, అనుమతించనవి ఏవో ఉంటాయి. ఏయే డాక్యుమెంట్లు తీసుకెళ్లాలో సూచనలు కూడా ఉంటాయి. ఈ గైడ్ లైన్స్ అన్నింటినీ అభ్యర్థులు పూర్తిగా చదివి అందుకు అనుగుణంగా అన్నీ సిద్ధం చేసుకొని పరీక్షకు హాజరు కావాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories