Rural Bank Jobs: గ్రామీణ బ్యాంకులలో ఉద్యోగం కావాలా.. పూర్తి ప్రక్రియని తెలుసుకోండి..!

Know the Complete Process to Get a Job in Rural Banks
x

Rural Bank Jobs: గ్రామీణ బ్యాంకులలో ఉద్యోగం కావాలా.. పూర్తి ప్రక్రియని తెలుసుకోండి..!

Highlights

Rural Bank Jobs: కొంతమందికి గ్రామీణ బ్యాంకులలో ఉద్యోగం చేయాలని ఉంటుంది కానీ ఆ ఉద్యోగాన్ని ఎలా సాధించాలో తెలియదు.

Rural Bank Jobs: కొంతమందికి గ్రామీణ బ్యాంకులలో ఉద్యోగం చేయాలని ఉంటుంది కానీ ఆ ఉద్యోగాన్ని ఎలా సాధించాలో తెలియదు. అందుకే బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రిపేరయ్యే ఉద్యోగులు కచ్చితంగా ఈ ఉద్యోగ ప్రక్రియ గురించి తెలుసుకోవాలి. వాస్తవానికి గ్రామీణ బ్యాంకులు గ్రామాల్లో ప్రాథమిక బ్యాంకింగ్, ఆర్థిక సేవలను అందించే మైక్రోఫైనాన్స్ సంస్థలు. దేశంలో 43 గ్రామీణ బ్యాంకులు పనిచేస్తున్నాయి. జాతీయ బ్యాంకుల మాదిరిగానే ఇవి కూడా నిపుణులను నియమించుకుంటాయి. ఈ బ్యాంకులలో ఉద్యోగం ఎలా పొందాలో ఈరోజు తెలుసుకుందాం.

ముందుగా వివిధ గ్రామీణ బ్యాంకులు తాత్కాలిక, కాంట్రాక్టు రిక్రూట్‌మెంట్ కోసం ప్రకటనలు జారీ చేస్తాయి. IBPS ప్రతి సంవత్సరం అన్ని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 పోస్టుల కోసం ప్రత్యక్ష నియామకాలను నిర్వహిస్తుంది. IBPS RRB కామన్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్), ఆఫీసర్ (స్కేల్ 1, 2, 3) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి.

నిర్దేశిత వయోపరిమితి

గ్రామీణ బ్యాంకులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులకు గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లు, ఆఫీసర్ స్కేల్ 2, స్కేల్ 3కి 40 ఏళ్లు. అయితే రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు నిబంధనల ప్రకారం అన్ని పోస్టులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు పొందుతారు. ప్రతి సంవత్సరం నిర్వహించే IBPS RRB CRP పరీక్షలో అర్హత సాధించడం ద్వారా ఈ ఉద్యోగాలు సాధించవచ్చు.

మూడు దశల్లో పరీక్ష

ముందుగా ప్రీ ఎగ్జామ్ నిర్వహిస్తారు. 45 నిమిషాల వ్యవధి గల ఈ పరీక్షలో రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ (క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఫర్ ఆఫీసర్ స్కేల్) 40 ప్రశ్నల చొప్పున అడుగుతారు. తరువాత మెయిన్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్, హిందీ, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 40 ప్రశ్నల చొప్పున అడుగుతారు. మూడో దశలో మెయిన్స్‌లో విజయం సాధించిన అభ్యర్థులకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆఫీసర్ పోస్టులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories