Hyderabad ECIL Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఈసీఐఎల్ లో ఉద్యోగాలు

Hyderabad ECIL Jobs
x

Hyderabad ECIL Jobs

Highlights

Hyderabad ECIL Jobs: హైదరాబాద్ (Hyderabad) లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈసీఐఎల్ (ECIL) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Hyderabad ECIL ITI Trade Apprentice Vacancy 2024: హైదరాబాద్ (Hyderabad) లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈసీఐఎల్ (ECIL) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో భాగంగా మొత్తం 437 ట్రేడ్ అప్రెంటిస్ షిప్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఏయో విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారో తెలుసుకుందాం.

హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈసీఐఎల్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో భాగంగా మొత్తం 437 ట్రేడ్ అప్రెంటిస్ షిప్ పోస్టులకు భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఏ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హతతో పాటు ఇతర విషయాలు తెలుసుకుందాం.

మొత్తం ఖాళీల సంఖ్య : 437

యూఆర్‌-175,

ఈడబ్ల్యూఎస్‌-44,

ఓబీసీ-120,

ఎస్‌సీ-65,

ఎస్టీ - 33

ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 162,

ఎలక్ట్రీషియన్- 70,

ఫిట్టర్- 70, మెకానిక్ (ఆర్‌ అండ్‌ ఏసీ)- 17,

టర్నర్- 17,

మెషినిస్ట్- 17,

మెషినిస్ట్(గ్రైండర్)- 13,

సీఓపీఏ- 45,

వెల్డర్- 22,

పెయింటర్- 4

ఆస్తకి, అర్హత ఉన్నఅభ్యర్థులు ఈనెల 29 లోపు దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారు. ముందుగా నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ లోఅప్రెంటిస్ గా నమోదు చేసుకోవాలి. దరఖాస్తుల స్వీకరణకు 29వ తేదీని చివరి తేదీగా ప్రకటించారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్లో దరఖాస్తులు చేసుకోవాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 31-10-2024 నాటికి 18ఏండ్లు నిండి ఉండాలి. జనరల్ అభ్యర్థులకు 25ఏండ్లు, ఓపీసీ అభ్యర్థులకు 28 ఏండ్లు, ఎస్సీ, ఎస్టీలకు 30ఏండ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు అదనంగా 10 ఏండ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

ఐటీఐ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ITI మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 70శాతం సీట్లు ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులకు 30శాతం సీట్లు, ప్రైవేట్ ఐటీఐ విద్యార్థులకు కేటాయిస్తారు. ఏడాది పాటు అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ ఉంటుంది. నవంబర్ 1 నుంచి 2024 శిక్షణ ప్రారంభం అవుతుంది. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ పాస్ సర్టిఫికేట్ అంటే NCVT సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఈ పోస్టులకు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నివసిస్తున్న అభ్యర్థులు మాత్రమే అప్లయ్ చేసుకునేందుకు అర్హులు అవుతారు.


Show Full Article
Print Article
Next Story
More Stories