Bank of Baroda Jobs: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు..

Jobs in Bank of Baroda No Written Test
x

Bank of Baroda Jobs: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు..

Highlights

Bank of Baroda Jobs: భారత ప్రభుత్వరంగ బ్యాంక్‌ అయిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా పలు ఉద్యోగాలకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Bank of Baroda Jobs: భారత ప్రభుత్వరంగ బ్యాంక్‌ అయిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా పలు ఉద్యోగాలకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఒక్కసారి నోటిఫికేషన్‌ పరిశీలించి ఉద్యోగాలకి అప్లై చేసుకోగలరు. ఈ ఉద్యోగాలకి పరీక్ష ఉండదని బ్యాంకు అధికారులు తెలిపారు. ఈ రిక్రూట్‌ మెంట్‌ కింద ఒప్పంద ప్రాతిపదికన డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్‌ పోస్టులని భర్తి చేస్తోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఖాళీల వివరాలు

డిప్యూటి వైస్ ప్రెసిడెంట్ - డేటా సైంటిస్ట్- 2 పోస్టులు

అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ - డేటా సైంటిస్ట్- 6 పోస్టులు

డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ - డేటా ఇంజినీర్- 2 పోస్టులు

అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ - డేటా ఇంజినీర్ - 4 పోస్టులు

డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ - డేటా సైంటిస్ట్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ - డేటా సైంటిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు AICTE/UGC గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్/బీఈ/ఎంటెక్/ఎంఈ చేసి ఉండాలి. లేకపోతే బీటెక్/బీఈలో కనీసం 60 శాతం మార్కులతో.. ఐటీ లేదా డేటా సైన్స్ లేదా మెషిన్ లెర్నింగ్ అండ్ ఏఐ చేసి ఉండాలి.

డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ - డేటా ఇంజినీర్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ - డేటా ఇంజినీర్ పోస్టుల కోసమైతే.. AICTE/UGC గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: జనరల్/ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ అభ్యర్ధులకు: రూ.600

ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులకు: రూ.100

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 7, 2022.

గమనిక: మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ www.bankofbaroda.inని సందర్శించవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories