పది, ఇంటర్‌, డిగ్రీ చదివినవారికి అలర్ట్‌.. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు..!

Jawaharlal Nehru University Recruitment 2023 388 Non Teaching Posts Check for all Details
x

పది, ఇంటర్‌, డిగ్రీ చదివినవారికి అలర్ట్‌.. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు..!

Highlights

JNU Recruitment 2023: నిరుద్యోగులకి ఇది సువర్ణవకాశమని చెప్పాలి.

JNU Recruitment 2023: నిరుద్యోగులకి ఇది సువర్ణవకాశమని చెప్పాలి. న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి 388 నాన్ టీచింగ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. సంబంధిత స్పెషలైజేషన్‌లో పదో తరగతి/ఇంటర్మీడియట్‌/బ్యాచిలర్స్‌ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ/ఐటీఐ డిప్లొమా/బీఈ/బీటెక్‌/బీఎస్సీ/బీపీఈడీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైన ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్‌ పోస్టులకు ఇంగ్లిష్‌/హిందీలో స్టెనోగ్రఫీ ఉండాలి. కంప్యూటర్‌ నైపుణ్యాలు అవసరం. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ప్రతి ఉద్యోగంలో అనుభవం కలిగి ఉండాలి.

తగిన అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 10, 2023వ తేదీ రాత్రి 11 గంటల 59 నిముషాలలోపు అప్లై చేసుకోవచ్చు. జనరల్/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్దులు గ్రూప్‌ 'ఏ' పోస్టులకు రూ.1500, గ్రూప్‌ 'బీ' పోస్టులకు రూ.1000లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్ధులు గ్రూప్‌ 'ఏ' పోస్టులకు రూ.1000, గ్రూప్‌ 'బీ' పోస్టులకు రూ.600లు ఫీజు చెల్లించాలి. వికలాంగ అభ్యర్ధులు ఫీజు చెల్లించనవసరం లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తుదారుల పోస్టును బట్టి 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు 2, అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు 3, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పోస్టులు 1, సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 8, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు 8, అసిస్టెంట్ పోస్టులు 3, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 106, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు 79, ప్రైవేట్ సెక్రటరీ పోస్టులు 1, పర్సనల్ అసిస్టెంట్ పోస్టులు 6, స్టెనోగ్రాఫర్ పోస్టులు 22, రిసెర్చ్ ఆఫీసర్ పోస్టులు 2, ఎడిటర్ పబ్లికేషన్ పోస్టులు 2, క్యూరేటర్ పోస్టులు 1, అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు 1, ప్రొఫెషనల్ అసిస్టెంట్ పోస్టులు 1, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ పోస్టులు 8 ఉన్నాయి.

అలాగే కుక్ పోస్టులు 19, మెస్ హెల్పర్ పోస్టులు 49, అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్ పోస్టులు 1, జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులు 1, వర్క్స్ అసిస్టెంట్ పోస్టులు 16, ఇంజినీరింగ్ అటెండెంట్ పోస్టులు 22, లిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు 3, సీనియర్ సిస్టమ్ అనలిస్ట్ పోస్టులు 1, సిస్టమ్ అనలిస్ట్ పోస్టులు 2, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 2, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు 1, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 1, జూనియర్ టెక్నీషియన్ పోస్టులు 1, జూనియర్ ఆపరేటర్ పోస్టులు 2 ఉన్నాయి.

అలాగే స్టాటిస్టికల్ అసిస్టెంట్ పోస్టులు 2, టెక్నీషియన్-ఎ పోస్టులు 1, అసిస్టెంట్ మేనేజర్(గెస్ట్ హౌస్) పోస్టులు 1, కార్టోగ్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులు 1, ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులు 3, ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులు 2, స్టాఫ్ నర్స్ పోస్టులు 1, స్పోర్ట్స్ అసిస్టెంట్ పోస్టులు 1, జూనియర్ ట్రాన్స్‌లేటర్ ఆఫీసర్ పోస్టులు 1 ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories