IOCLలో ఉద్యోగాలు.. జీతం 78,000.. ఎవరు అర్హులంటే..?

iocl recruitment 2022 Salary 78,000 selection process details
x

IOCLలో ఉద్యోగాలు.. జీతం 78,000.. ఎవరు అర్హులంటే..?

Highlights

IOCLలో ఉద్యోగాలు.. జీతం 78,000.. ఎవరు అర్హులంటే..?

IOCL: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)జూనియర్‌ ఆపరేటర్‌ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు IOCL అధికారిక వెబ్‌సైట్ iocl.comని సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జూలై 29. ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా మొత్తం 39 ఖాళీలు భర్తీ అవుతాయి.

దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 29 జూలై 2022

ఖాళీల వివరాలు:

జూనియర్ ఆపరేటర్ (ఏవియేషన్) Gr. I (పోస్ట్ కోడ్-101) తెలంగాణ: 05

జూనియర్ ఆపరేటర్ (ఏవియేషన్) Gr. I (పోస్ట్ కోడ్-102) కర్ణాటక: 06

జూనియర్ ఆపరేటర్ (ఏవియేషన్) Gr. I (పోస్ట్ కోడ్-103) తమిళనాడు & పుదుచ్చేరి: 28

అర్హత ప్రమాణాలు

జూనియర్ ఆపరేటర్ (ఏవియేషన్) Gr. I: అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి కనీసం 45% మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే ప్రాంతీయ రవాణా అథారిటీ జారీ చేసిన చెల్లుబాటు అయ్యే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories