ఇవాళ్టి నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైన కేంద్రంలోకి అనుమతి నిరాకరణ

Inter Exams in Telangana from Today
x

ఇవాళ్టి నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైన కేంద్రంలోకి అనుమతి నిరాకరణ

Highlights

Inter Exams: ఏర్పాట్లు పూర్తి చేసిన ఇంటర్ బోర్డు

Inter Exams: తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 14 వందల 73 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తం 9 లక్షల 47వేల 699 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ 4 లక్షల 82 వేల 677 కాగా, సెకండ్ ఇయర్ 4 లక్షల 65 వేల 22 మంది ఉన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించేది లేదని బోర్డు పేర్కొంది. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభమై ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్నాయి. సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 29వ తేదీతో పరీక్షలు ముగుస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories