Indian Railway Recruitment 2023: ఐటీఐ నిరుద్యోగులకి గుడ్‌న్యూస్‌.. రైల్వేలో అప్రెంటిస్‌ ఉద్యోగాలు..!

Indian Railway Recruitment 2023 North Eastern Railway Apprentice Posts Check for all Details
x

Indian Railway Recruitment 2023: ఐటీఐ నిరుద్యోగులకి గుడ్‌న్యూస్‌.. రైల్వేలో అప్రెంటిస్‌ ఉద్యోగాలు..!

Highlights

Indian Railway Recruitment 2023: ఐటీఐ చదివిన నిరుద్యోగులకి ఇది శుభవార్తని చెప్పాలి. ఎందుకంటే నార్త్ ఈస్టర్న్ రైల్వే అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Indian Railway Recruitment 2023: ఐటీఐ చదివిన నిరుద్యోగులకి ఇది శుభవార్తని చెప్పాలి. ఎందుకంటే నార్త్ ఈస్టర్న్ రైల్వే అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇండియన్‌ రైల్వేలో జాబ్‌ చేయాలంటే ఇది మంచి అవకాశమని చెప్పొచ్చు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ని rrcgorkhpur.net సందర్శించి ఆన్‌లైన్ మోడ్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఫారమ్‌ను పూరించడానికి 2 ఆగస్టు 2023 వరకు సమయం కేటాయించారు. అభ్యర్థులు తప్పనిసరిగా 50 శాతం మార్కులతో పదో తరగతి పాసై ఉండాలి. అలాగే నోటిఫైడ్ ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 15, గరిష్ట వయస్సు 24 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఎంపిక ప్రక్రియ మెరిట్ జాబితా ఆధారంగా ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాలి. SC, ST, EWS, దివ్యాంగ్ (PWBD), మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. అభ్యర్థులు చివరితేదీ వరకు వేచి ఉండకుండా వెంటనే అప్లై చేసుకోవడం ఉత్తమం.

ఖాళీల వివరాలు

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద మొత్తం 1,104 పోస్టులని భర్తీ చేస్తారు.

మెకానికల్ వర్క్‌షాప్/గోరఖ్‌పూర్: 411 పోస్టులు

క్యారేజ్ & వ్యాగన్/లక్నో జంక్షన్: 155 పోస్టులు

మెకానికల్ వర్క్‌షాప్/ఇజ్జత్‌నగర్: 151 పోస్టులు

డీజిల్ షెడ్/గోండా: 90 పోస్టులు

క్యారేజ్ & బండి/వారణాసి: 75 పోస్ట్‌లు

క్యారేజ్ & వ్యాగన్

/ఇజ్ నగర్ కాంట్: 63 పోస్టులు

డీజిల్ షెడ్/ఇజ్జత్‌నగర్: 60 పోస్టులు

బ్రిడ్జ్ వర్క్‌షాప్/గోరఖ్‌పూర్ కాంట్: 35 పోస్టులు

ఎలా అప్లై చేయాలి..?

1. ముందుగా ఈశాన్య రైల్వే అధికారిక వెబ్‌సైట్‌కి rrcgorkhpur.net వెళ్లాలి.

2. హోమ్‌పేజీలో రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ఫారమ్‌ ఉంటుంది.

3. అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను నింపాలి.

4. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.

5. తర్వాత నిర్ణీత దరఖాస్తు రుసుమును చెల్లించాలి.

6. తర్వాత అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేయాలి.

7. భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories