Indian Railway Recruitment 2022: పది, ఐటీఐ వారికి శుభవార్త.. రైల్వేలో 3115 పోస్టులు..!

Indian Railway Recruitment 2022 Eastern Railway has Started the Application Process for the Recruitment of Apprentices
x

Indian Railway Recruitment 2022: పది, ఐటీఐ వారికి శుభవార్త.. రైల్వేలో 3115 పోస్టులు..!

Highlights

Indian Railway Recruitment 2022: పది, ఐటీఐ వారికి శుభవార్త.. రైల్వేలో 3115 పోస్టులు..!

Indian Railway Recruitment 2022: తూర్పు రైల్వే అప్రెంటిస్‌ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. అర్హత కలిగిన వ్యక్తులు rrcer.comలో 29 అక్టోబర్ 2022 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కోల్‌కతాలోని హౌరా డివిజన్, లిలుహ్ వర్క్‌షాప్, సీల్దా డివిజన్, కంచరపరా వర్క్‌షాప్, మాల్దా డివిజన్, అసన్సోల్ వర్క్‌షాప్, జమాల్‌పూర్ వర్క్‌షాప్‌లలో 3115 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50% మార్కులతో 10వ తరగతి లేదా దానికి సమానమైన (10+2 పరీక్షా విధానంలో) ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే NCVT/SCVT ద్వారా జారీ చేసిన నోటిఫైడ్ ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ తనిఖీ చేయండి. అభ్యర్థి వయస్సు కనీసం 15 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 24 సంవత్సరాలు ఉండాలి. ఐటిఐలో అర్హత, సగటు మార్కుల ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ (డివి) కోసం పిలుస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేయాలి..?

1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ ER - rrcer.com కోల్‌కతాకు వెళ్లాలి.

2. 'తూర్పు రైల్వే యూనిట్లలో ట్రైనింగ్ స్లాట్ కోసం యాక్ట్ అప్రెంటిస్‌ల ఎంగేజ్‌మెంట్ కోసం ఆన్‌లైన్ అప్లికేషన్ నింపడానికి లింక్ నోటీసు నం.RRC-ER/యాక్ట్ అప్రెంటీస్/2022-23'కి వెళ్లాలి.

3. ఇక్కడ అడిగిన వివరాలను అందించాలి.

4. 'ఇంకా కొనసాగించడానికి క్లిక్ చేయండి' లింక్‌కి వెళ్లాలి.

5. ఏదైనా ఉంటే ట్రేడ్ లేదా వైకల్యం రకం ఎంచుకోండి.

6. ఈ మెయిల్ ఐడి / మొబైల్ నంబర్ మొదలైన వాటితో సహా అసలు వివరాలను అందించండి.

7. ఇప్పుడు మీ యూనిట్ ప్రాధాన్యతను ఎంచుకోండి.

8. రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన స్కాన్ చేసిన ఫోటోగ్రాఫ్, సంతకం, పత్రాలను అప్‌లోడ్ చేయండి.

Show Full Article
Print Article
Next Story
More Stories