Indian Navy Jobs 2022: పది, ఐటీఐ చేసిన వారికి శుభవార్త.. నేవీలో బంపర్‌ ఉద్యోగాలు..!

Indian Navy Recruitment 2022 Navy Jobs Chek for all Details
x

Indian Navy Jobs 2022: పది, ఐటీఐ చేసిన వారికి శుభవార్త.. నేవీలో బంపర్‌ ఉద్యోగాలు..!

Highlights

Indian Navy Jobs 2022: ఇండియన్ నేవీ హెడ్‌క్వార్టర్స్ అండమాన్, నికోబార్ కమాండ్‌లోని వివిధ యూనిట్లలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల అయింది.

Indian Navy Jobs 2022: ఇండియన్ నేవీ హెడ్‌క్వార్టర్స్ అండమాన్, నికోబార్ కమాండ్‌లోని వివిధ యూనిట్లలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల అయింది. గ్రూప్ "సి" నాన్-గెజిటెడ్, ఇండస్ట్రియల్ క్లాసిఫైడ్ ట్రేడ్స్‌మెన్ మేట్ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇండియన్ నేవీ ట్రేడ్స్‌మ్యాన్ దరఖాస్తు ఫారమ్ 06 ఆగస్టు 2022న అందుబాటులో ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ అంటే https://erecruitment.andaman.gov.in లో 06 సెప్టెంబర్ 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు .

ఎంపికైన అభ్యర్థులు సాధారణంగా అండమాన్, నికోబార్ కమాండ్ అడ్మినిస్ట్రేటివ్ నియంత్రణలో ఉన్న యూనిట్లలో పనిచేయవలసి ఉంటుంది. పరిపాలనా అవసరాల ప్రకారం వారిని భారతదేశంలో ఎక్కడైనా నౌకాదళ యూనిట్లు/ఫార్మేషన్లలో పోస్ట్ చేయవచ్చు. గుర్తింపు పొందిన బోర్డు/సంస్థల నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి. అలాగే సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. వయోపరిమితి గురించి మాట్లాడితే అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయోపరిమితి 25 సంవత్సరాలు.

ఎంపిక ప్రక్రియ

మొదట అభ్యర్థుల దరఖాస్తుల స్క్రీనింగ్ ఉంటుంది. ఆ తర్వాత రాత పరీక్ష ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు.

ఎలా అప్లై చేయాలి..?

1. దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://erecruitment.andaman.gov.in కి వెళ్లాలి.

2. అక్కడ మీరు 'ట్రేడ్స్‌మ్యాన్ మేట్, హెడ్‌క్వార్టర్స్, అండమాన్, నికోబార్ కమాండ్ పోస్ట్ రిక్రూట్‌మెంట్' కింద 'ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి' ఎంపికను చూస్తారు.

3. ఇప్పుడు మీ వివరాలను నమోదు చేసి సమర్పించాలి.

4. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 112 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఈ విధంగా జనరల్ కేటగిరీ 43, ఓబీసీ 32, ఎస్సీ 18, ఎస్టీ 8, ఈడబ్ల్యూఎస్ 11 పోస్టులు భర్తీ చేస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories