Indian Army Jobs 2023: ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగాలు.. ఏపీ, తెలంగాణ వారు కూడా అర్హులే..!

Indian Army Nursing Assistant Recruitment Rally 2023 Check for All Details
x

Indian Army Jobs 2023: ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగాలు.. ఏపీ, తెలంగాణ వారు కూడా అర్హులే..!

Highlights

Indian Army Jobs 2023: ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగాలు.. ఏపీ, తెలంగాణ వారు కూడా అర్హులే..!

Indian Army Jobs 2023: భారత సైన్యానికి చెందిన చెన్నైలోని జోన్ రిక్రూటింగ్ ఆఫీస్‌లో సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్/నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి తో పాటు అండమాన్ నికోబార్, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు అర్హులు. ఈ నోటిఫికేషన్‌ కింద ఎన్ని ఖాళీలు ఉన్నాయి. అర్హతలు ఏంటి.. తదితర పూర్తి విషయాల గురించి తెలుసుకుందాం.

రిక్రూట్‌మెంట్‌లో భాగంగా సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్/నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరీ పోస్టులను భర్తీ చేస్తారు. అభ్యర్థుల కనీస వయసు 17 1/2 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. అక్టోబర్ 1, 2000 నుంచి అక్టోబర్ 1, 2006 మధ్య జన్మించిన వారై ఉండాలి. అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు 10+2/ఇంటర్మీడియట్ సైన్స్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ,బయాలజీ/బోటనీ,జువాలజీ, ఇంగ్లీష్)లో కనీసం 50 శాతం మార్కులు, ప్రతి సబ్జెక్ట్ లో 40 శాతం మార్కులతో పాస్‌ అయి ఉండాలి.

ఎత్తు 165 సెం.మీ, గాలి పీల్చినప్పుడు ఛాతీ 5 సెం.మీ విస్తరించేలా ఉండాలి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో మాత్రమే అప్లై చేసుకోవాలి. అభ్యర్థులను సీబీటీ టెస్ట్‌(ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష) ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, వైద్య పరీక్షలు,ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ఫిబ్రవరి 16వ తేదీన ప్రారంభమవగా మార్చి 15 చివరితేది. పరీక్షను ఏప్రిల్‌ 17వ నిర్వహిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories