India Post Jobs 2023: పోస్టాఫీసులో డ్రైవర్‌ ఉద్యోగాలు.. పదో తరగతి పాసైనవారు అర్హులు..!

India Post Staff Car Driver Recruitment 2023 Check for all Details
x

India Post Jobs 2023: పోస్టాఫీసులో డ్రైవర్‌ ఉద్యోగాలు.. పదో తరగతి పాసైనవారు అర్హులు..!

Highlights

India Post Jobs 2023: పదో తరగతి చదివి డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నవారికి ఇది శుభవార్తని చెప్పవచ్చు.

India Post Jobs 2023: పదో తరగతి చదివి డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నవారికి ఇది శుభవార్తని చెప్పవచ్చు. ఇండియా పోస్ట్ స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టల్ సర్కిల్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో 53 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మీరు 10వ తరగతి ఉత్తీర్ణులై ప్రభుత్వ ఉద్యోగంపై ఆసక్తి కలిగి ఉంటే పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం సాధించే అవకాశం వచ్చింది. ఈ నోటిఫికేషన్‌ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ డ్రైవర్‌ పోస్టులకి ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు 31 మార్చి 2023లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌లో ఇచ్చిన ప్రకారం 10వ తరగతి ఉత్తీర్ణతతోపాటు తేలికపాటి, భారీ మోటారు వాహనాలకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. మోటారు మెకానిజంపై పరిజ్ఞానంపై అవగాహన కలిగి ఉండాలి. లైట్, హెవీ మోటారు వాహనాలను నడపడంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.

నోటిఫికేషన్‌ డౌన్‌లోడ్‌ ఎలా..?

1. అభ్యర్థులు ముందుగా ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.

2. హోమ్ పేజీలో ప్రకటన విభాగానికి వెళ్లండి.

3. 'తమిళనాడు సర్కిల్ PDF ఐకాన్ [2384 KB]లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) 58 పోస్ట్‌ల నియామకంపై క్లిక్‌ చేయండి.

4. ఇప్పుడు PDF ఆఫ్ ఇండియా పోస్ట్ స్టాఫ్ కార్ డ్రైవర్ రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్‌ను కొత్త విండో పొందుతారు.

5. ఇండియా పోస్ట్ స్టాఫ్ కార్ డ్రైవర్ రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

6. అప్లికేషన్‌ ప్రాసెస్‌ గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories