India Post Jobs 2023: పదో తరగతితో పోస్టల్‌ ఉద్యోగం.. పరీక్ష లేకుండానే మెరిట్‌ లిస్ట్‌..!

India Post Recruitment 2023 40889 Jobs Check for all Details
x

India Post Jobs 2023: పదో తరగతితో పోస్టల్‌ ఉద్యోగం.. పరీక్ష లేకుండానే మెరిట్‌ లిస్ట్‌..!

Highlights

India Post GDS Recruitment 2023: ఇండియా పోస్ట్‌ నుంచి 40,889 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.

India Post GDS Recruitment 2023: ఇండియా పోస్ట్‌ నుంచి 40,889 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో ఖాళీలున్నాయి. ఇందులో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్‌), బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌ (బీపీఎం), అసిస్టెంట్‌బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ పోస్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2,480 పోస్టులుండగా తెలంగాణలో 1266 వరకు ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 16, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.

ఈ ఉద్యోగాలలో రోజుకు కేవలం 4 గంటల పని మాత్రమే ఉంటుంది. వీటితోపాటు ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన సేవలకు అదనంగా ఇన్సెంటివ్‌ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్‌ సేవక్‌లకు ప్రోత్సాహం అందిస్తారు. ఈ విధమైన విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్‌/కంప్యూటర్‌/స్మార్ట్‌ ఫోన్‌ లాంటివి తపాలా శాఖ అందిస్తుంది. మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, స్థానిక భాష సబ్జెక్టులతో పదో తరగతిపాసై ఉండాలి. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారైతే తెలుగు సబ్జెక్టుతో పది పాసై ఉండాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు జనవరి 27 నుంచి ప్రారంభమవుతాయి. జనరల్ అభ్యర్ధులు రూ.100లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, ట్రాన్స్‌ జండర్‌, మహిళా అభ్యర్ధులు ఫీజు చెల్లించనవసరం లేదు. పదో తరగతిలో సాధించిన మార్కులు, రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది. బీపీఎం పోస్టులకు రూ.12,000, ఏబీపీఎం/డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000, జీతంగా చెల్లిస్తారు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. అలాగే సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories