IGM Recruitment 2022: ఇండియన్‌ గవర్నమెంట్‌ మింట్‌లో ఉద్యోగాలు.. జీతం నెలకి 80,000 పైనే..!

IGM Recruitment 2022 IGM Kolkata Jobs 7 Engraver Junior Office Assistant Posts
x

IGM Recruitment 2022: ఇండియన్‌ గవర్నమెంట్‌ మింట్‌లో ఉద్యోగాలు.. జీతం నెలకి 80,000 పైనే..!

Highlights

IGM Recruitment 2022: కోల్‌కతాలోని ఇండియా గవర్నమెంట్ మింట్, ఎన్‌గ్రేవర్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

IGM Recruitment 2022: కోల్‌కతాలోని ఇండియా గవర్నమెంట్ మింట్, ఎన్‌గ్రేవర్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 7 పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీటికి ఎంపికైన అభ్యర్థులు 1 సంవత్సరం పాటు ప్రొబేషన్‌లో ఉంటారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్ కోసం జూన్ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు IGM కోల్‌కతా అధికారిక సైట్ igmkolkata.spmcil.comని సందర్శించడం ద్వారా అప్లై చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీల సంఖ్య: 7

పోస్టుల వివరాలు: ఎంగ్రేవర్‌, జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంగ్రేవర్‌ పోస్టులు: 3

అర్హతలు: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.23,910ల నుంచి రూ.85,570ల వరకు జీతంగా చెల్లిస్తారు.

జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులు: 4

అర్హతలు: బ్యాచిలర్‌ డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కూడా ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.21,540ల నుంచి రూ.77,160ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 7, 2022.

ఇలా దరఖాస్తు చేసుకోండి

1. ముందుగా అభ్యర్థులు IGM Kolkata, Igmkolkata.spmcil.com అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.

2. హోమ్ పేజీలోని కెరీర్‌ల ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

3. తర్వాత దరఖాస్తు లింక్‌పై క్లిక్ చేయండి.

4. ఇప్పుడు మీ దరఖాస్తు ఫారమ్ నింపండి.

5. తర్వాత దరఖాస్తు రుసుము చెల్లించండి.

6. ఇప్పుడు దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించండి.

7. చివరగా భవిష్యత్తు ఉపయోగం కోసం దాని ప్రింట్ అవుట్ తీసుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories